అతలాకుతలమైన తెలంగాణ.. 365 మండలాల్లో కరువు విలయతాండవం

వానా కాలం వచ్చింది.. ఇప్పుడు అర్మాబ్ తుఫాన్ కూడా వచ్చింది. కానీ పుడమి తల్లిని మాత్రం అభిషేకించలేకపోయింది. ఫలితంగా ఈ ఏడాది వానకాలం సీజన్ తెలంగాణ రైతులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. నైరుతి రుతుపవనాల కాలంలో వరుసగా వచ్చిన సుదీర్ఘ అనావృష్టి రోజులు, బంగాళాఖాతంలో బలహీనపడిన ద్రోణులు, ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు ముఖం చాటేశాయి. జూన్ నుంచి సెప్టెంబరు చివరి వరకు పడాల్సిన సాధారణ వర్షపాతం కంటే ఏకంగా 17 శాతం తక్కువగా నమోదు కావడం ఈ సంక్షోభానికి ప్రధాన కారణమైంది. దాంతో రాష్ట్రంలోని 31 జిల్లాల పరిధిలోని 365 మండలాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తూ జీవో జారీ చేసింది. ఈ ఉత్తర్వులు రాబోయే ఆరు నెలల పాటు అమల్లో ఉండనున్నాయి.

పాత పచ్చదనం ఏమైంది?

నీటి లభ్యత తగ్గడంతో పొలాల్లో నాగలి తిరగడమే కష్టంగా మారింది. గతేడాదితో పోలిస్తే ఈసారి సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. గతంలో సుమారు 139 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, ఈ వానకాలంలో అది 126 లక్షల ఎకరాలకు పరిమితమైంది. ముఖ్యంగా మన రాష్ట్రానికి ప్రధాన ఆధారమైన వరి సాగు అత్యధికంగా దెబ్బతింది. గతంలో 69 లక్షల ఎకరాల్లో వరి వేయగా, ఈసారి అది ఏకంగా 18 శాతం తగ్గి కేవలం 57 లక్షల ఎకరాలకే పరిమితం కావడం వ్యవసాయ రంగానికి పెద్ద దెబ్బగా మారింది.

Telangana Declares 365 Mandals As Drought Affected For Vanakalam 2026 Amid 17 Percent Rainfall Deficit

తీవ్రమైన కరువులో వందకు పైగా మండలాలు!

ప్రభుత్వం గుర్తించిన 365 మండలాల్లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఇందులో 111 మండలాలను తీవ్రమైన కరువు బారిన పడినవిగా వర్గీకరించగా, మరో 254 మండలాలను సాధారణ కరువు ప్రాంతాలుగా గురించారు. మిగిలిన మండలాల్లోనూ నీటి ఎద్దడిని ఎప్పటికప్పుడు గమనించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పరిస్థితులు మరింత దిగజారితే మరికొన్ని మండలాలను కూడా ఈ జాబితాలో చేర్చే అవకాశముంది.

తీవ్రమైన కరువు. ఒక రోజు జీతం విరాళం ! ఐఏఎస్, ఐపీఎస్ ల ఉదారత
తీవ్రమైన కరువు. ఒక రోజు జీతం విరాళం ! ఐఏఎస్, ఐపీఎస్ ల ఉదారత

జలాశయాల్లో ఆందోళనకర మట్టాలు.. నీటి కష్టాల ముప్పు!

వర్షాలు లేకపోవడంతో ప్రధాన, మధ్య తరహా ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. రాష్ట్రంలోని రిజర్వాయర్ల మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 585 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందులో కేవలం 179 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు అడుగుకు చేరడంతో కేవలం సాగునీటికే కాకుండా, రాబోయే రోజుల్లో తాగునీరు, పశువుల మేత, జలవిద్యుత్ ఉత్పత్తికి కూడా తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది.

Srisailam Dam: శ్రీశైలం ఖాళీ! చరిత్రలోనే ఆరో సారి.. కరువు దిశగా కృష్ణా బేసిన్?
Srisailam Dam: శ్రీశైలం ఖాళీ! చరిత్రలోనే ఆరో సారి.. కరువు దిశగా కృష్ణా బేసిన్?

కేంద్రానిన్ని రూ. 20,000 కోట్ల సహాయం కోరిన తెలంగాణ!

ఈ అభాగ్య పరిస్థితుల నుంచి రాష్ట్ర ప్రజలను, రైతులను గట్టెక్కించేందుకు తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. రాష్ట్రంలో కరువు పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వెంటనే కేంద్ర బృందాన్ని పంపాలని విజ్ఞప్తి చేసింది. అలాగే రూ. 20,000 కోట్ల ప్రత్యేక కరువు ఉపశమన ప్యాకేజీతో పాటు ఉపాధి హామీ పథకం కింద కూలీలకు అదనంగా 50 రోజుల పనిదినాలు కల్పించాలని కోరింది. సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ, తాగునీటి సరఫరా, అదనపు విద్యుత్, ఎరువుల సరఫరాకు తోడ్పాటు అందించాలని అసెంబ్లీ వేదికగా కేంద్రాన్ని అభ్యర్థించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+