దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి; అసలేం జరిగిందంటే!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిని మించి ఒకరు దూకుడుగా ఎన్నికల వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. ఈసారి అన్ని ప్రధాన పార్టీలు అమీతుమీ తేల్చుకోవటానికి రెడీ కావడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అయితే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వారిపై ఊహించని విధంగా దాడులు కూడా కొనసాగుతున్నాయి.
తాజాగా మెదక్ పార్లమెంటు సభ్యుడు, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఒక వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దౌలతాబాద్ మండలం సూరంపల్లి లో కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తనను గెలిపించాలని గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రాజు అనే వ్యక్తి హఠాత్తుగా దూసుకు వచ్చి ఊహించని విధంగా ఆయన కడుపుపై కత్తితో దాడి చేశాడు.

ఈ ఘటనలో కొత్త ప్రభాకర్ రెడ్డి కి గాయాలయ్యాయి. అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడితో షాక్ కు గురయ్యారు. ఆపై వెంటనే తేరుకుని ఒక్కసారిగా దాడి చేసిన రాజును పట్టుకుని చితకబాదారు. అతన్ని అనంతరం పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి పై రాజు ఎందుకు దాడి చేశాడు. అసలు రాజు ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు దాడి అనంతరం కడుపు భాగంలో గాయమైన కొత్త ప్రభాకర్ రెడ్డిని ఆయన వాహనంలోనే ఆసుపత్రికి తరలించారు. మొదటి గజ్వేల్ కు తరలించి అక్కడ ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం కొత్త ప్రభాకర్ రెడ్డిని హైదరాబాద్ కు తరలించారు.
Unknown person attack #BRS sitting MP Kotha Prabhakar Reddy with a knife
— Aneri Shah (@tweet_aneri) October 30, 2023
During the election campaign he was attacked in Doulthabad Mandal of #Siddipet
BRS MP was rushed to the hospital after he received injuries #Telangana #TelanganaAssemblyElections2023 pic.twitter.com/G9AB4oMUXn
అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి పై జరిగిన దాడి ప్రతిపక్షాల ప్రమేయంతో జరిగిన దాడినా, లేకా రాజు వ్యక్తిగతంగా చేసిన దాడినా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా దుబ్బాకలో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications