తెలంగాణా ఎన్నికలు: పెళ్లిళ్లకు ముహూర్తం: అభ్యర్థులకు నవంబర్ గండం!!
తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకర్ని మించి ఒకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇక ఎన్నికల కురుక్షేత్రంలో అమీతుమీ తేల్చుకునే పనిలో పడ్డారు అన్ని పార్టీల నేతలు. అయితే వచ్చే నెలలో ఎన్నికల ప్రచారం పీక్స్ లోకి వెళ్ళనుండటంతో అభ్యర్థులు ఓటర్లను తమవైపుకు తిప్పుకునే పనిలో పడ్డారు. అయితే అభ్యర్థులకు ఇప్పుడు కొత్త కష్టం వచ్చింది. నవంబర్ నెల అభ్యర్థులకు గండంగా మారింది .
ఇప్పుడు రానున్న నవంబర్ నెలలో పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో అందరూ పెళ్లి బిజీలో పడిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవడం ఎలా అని అభ్యర్థులు ఆలోచనలో పడ్డారు. పెళ్లిళ్లు చేసుకుంటే మాకేంటి.. పెళ్లిళ్లకి వెళ్లి కళ్యాణ మండపాలను వేదికలుగా మార్చుకుంటే పోలా అన్న ఆలోచనలో అభ్యర్థులు ఉన్నట్టు తెలుస్తుంది.

నవంబర్ నెలలో 15, 19, 21, 22, 23, 24, 26, 29 తేదీలలో మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిగా పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ఈ సమయంలో నవంబర్ 30వ తేదీనే పోలింగ్ జరగనుండడంతో ఓటర్లు ఓటు వెయ్యటం మర్చిపోవద్దని అధికారులు ఓటర్లను కోరుతున్నారు.
ఇక పెళ్లిళ్ల హడావిడిలో తమను పట్టించుకోరేమో అని ఆవేదనలో ఉన్న అభ్యర్థులు నేరుగా కళ్యాణ మండపాలకి వెళ్లి అక్కడి వారందరికీ ఆకట్టుకునే ప్రయత్నం చేయాలని భావిస్తున్నారు. నవంబర్ 16వ తేదీ నుండి 23వ తేదీ మధ్య ఎక్కువగా పెళ్లిళ్లు జరగనున్న నేపథ్యంలో ఆయా తేదీలలో కళ్యాణ మండపాలను సందర్శించాలని ప్లాన్ చేసుకున్నారు.
ఇక తమ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల వారీగా ఎక్కడెక్కడ పెళ్లిళ్లు జరుగుతున్నాయి? ఎవరెవరి ఇంట్లో పెళ్లిళ్లు జరుగుతున్నాయి? అనేది తెలుసుకొని, డైరీలలో నోట్ చేసుకొని పెట్టుకుంటున్నారు. ప్రతి ఓటు కీలకమని భావిస్తున్న నేతలు మీరు పెళ్లి బిజీలో ఉన్నా సరే మేము మాత్రం మీ దగ్గరకు వచ్చేది వచ్చేదే అన్నట్టు రెడీ అవుతున్నారు. మొత్తంగా చూస్తే ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు, నవంబర్ నెలలో జరగనున్న పెళ్లిళ్లు అభ్యర్థుల చావుకొచ్చేట్టు ఉందని తెగ చర్చ జరుగుతుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications