కేసీఆర్ కు గజ్వేల్ లో షాక్!!

తెలంగాణ అంతటా నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. నిన్న ఒక్క రోజే 281 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ రోజు కూడా పలు నియోజక వర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధులు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో దాఖలవుతున్న పలు నామినేషన్లు సీఎం కేసీఆర్ కు షాక్ ఇస్తున్నాయి.

నేడు బీఆర్ఎస్ అభ్యర్ధులుగా కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి మంత్రి గంగుల కమలాకర్, తాండూరు పైలెట్ రోహిత్ రెడ్డి , నర్సంపేట పెద్ది సుదర్శన్ రెడ్డి , కోదాడ బొల్లం మల్లయ్య యాదవ్, వరంగల్ తూర్పు నన్నపునేని నరేందర్ బీఆర్ఎస్ అభ్యర్ధులుగా ఈ రోజు నామినేషన్ లు దాఖలు చేశారు.

telangana election 2023: Shock for KCR in Gajwel with sugarcane farmers nominations

వనపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి తుడి మేఘారెడ్డి నామినేషన్ దాఖలు చేసారు. మాన కొండూరు నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్తిగా ఆరెపల్లి మోహన్, కాంగ్రెస్ అభ్యర్తిగా కవ్వం పల్లి సత్యనారాయణ, చొప్పదండి నుండి బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్తిగా సుంకే రవిశంకర్, బిజెపి అభ్యర్తిగా బోడిగే శోభ, హుజురాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్తిగా వొడితేలా ప్రణవ్ లు, బీజేపీ అభ్యర్తిగా ఈటెల రాజేందర్ తరపున నామినేషన్లు వేశారు.

ఈ సందర్బంగా బీఆర్ఎస్ అభ్యర్ధులు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. ఏ లక్ష్యంతోనైతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ దిశగా తెలంగాణ పరుగెడుతుందన్నారు. తెలంగాణ ఉద్యమ నినాదమైన 'నీళ్లు, నిధులు, నియామకాలు' అన్నింటినీ కేవలం తొమ్మిదేండ్లలోనే సాకారం చేసుకున్నామని అన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్ పై పోటీ చేయడానికి మాత్రం కామారెడ్డి, గజ్వేల్ ప్రాంత రైతులు పోటీ పడుతున్నారు.

సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ పైన పోటీచేసి బీఆర్ఎస్ అధినేతకు షాక్ ఇస్తున్నారు. ఈ క్రమంలో నేడు సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో జగిత్యాల జిల్లా చెరుకు రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో నారాయణరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, లింబాద్రిలు ఉన్నారు.

మూసేసిన ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని తెరిపించాలని వారు డిమాండ్ చేశారు. అన్ని పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వారు కేసీఆర్ కు వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేశారు. కెసిఆర్ కు పొరపాటున కూడా ఓటు వేసి గెలిపించొద్దని వారు గజ్వేల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+