Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా: తన విజయంపై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. స్పష్టమైన మెజార్టీ రావడంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రజల తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా 100 రోజుల్లోనే అమలు చేసి తీరుతామన్నారు.

మరోవైపు, కొడంగల్‌​లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి విజయం సాధించారు. 31,849 ఓట్లతో బీఆర్​ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ ​రెడ్డిపై విజయం సాధించారు. కొడంగల్‌​లో గెలుపుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి(Revanth reddy) ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Telangana election results: Revanth reddy responded on winning from kodangal

ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. ఈ గడ్డపై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే బాధ్యత తీసుకుంటానని.. దేశానికి కొడంగల్ ను ఒక మోడల్ గా నిలబెడతానని హామీ ఇచ్చారు రేవంత్.

కాగా, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలకుపైగా గెలుపును నమోదు చేసింది. ఇప్పటి వరకు 64 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందగా.. మరో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ 33 స్థానాల్లో గెలుపొందగా.. మరో 6 స్థానాల్లో విజయం దిశగా సాగుతోంద. మరోవైపు, బీజేపీ 8 స్థానాల్లోనే గెలుపునకు పరిమితమైంంది. ఎంఐఎం ఏడు స్థానాల్లో విజయం సాధించింది.

ఇక, కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రావడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్ రావాలని కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 4 సోమవారం లేదా డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది. అయితే, సీఎం ఎవరనే విషయంపై ఉత్కంఠ సాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+