వారికేనా?.. మాకు డబ్బులివ్వరా?: మిర్యాలగూడలో మహిళా ఓటర్ల ఆందోళన

నల్గొండ: తమకు డబ్బులు ఇవ్వలేదని కొందరు మహిళలు ఆందోళన చేపట్టారు.
అన్ని వార్డుల్లో ఓటర్లకు డబ్బులిస్తూ.. తమ వీధిలో మాత్రమే ఇవ్వలేదంటూ మిర్యాలగూడలోని 36, 38 వార్డుల్లో పలువురు మహిళలు ఆందోళనకు దిగారు. బుధవారం సాయంత్రం ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. తాము వేరే పార్టీకి చెందిన వాళ్లమని స్థానిక నాయకులు నిందలు వేస్తూ తమకు డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు.

అన్ని వార్డుల్లో ఇచ్చి.. తమ వార్డుల్లో ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారంటూ మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, మహిళల ఆందోళనపై స్పందించిన సదరు అభ్యర్థి.. వారికి సర్ది చెప్పడంతో ఆందోళన విరమించినట్లు తెలిసింది.

 Telangana elections: agitation of women voters in miryalaguda for money

జ్వరంతో సొమ్మసిల్లి పడిపోయిన ప్రిసైడింగ్ అధికారి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. అయితే, రంగారెడ్డి జిల్లాలో ఓ ప్రిసైడింగ్ అధికారి జ్వరంతో కళ్లు తిరిగి పడిపోయారు. వివరాల్లోకి వెళితే.. సరూర్‌నగర్‌లోని జడ్పీహెచ్ఎస్‌లో బయో సైన్స్ పాఠాలు బోధించే ఉపాధ్యాయుడు వెంకటేష్.. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు.

ఈ క్రమంలోనే జ్వరంతోనే ఆయన ఎన్నికల విధులకు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మంగల్‌పల్లి‌లోని సీవీఆర్ కాలేజీలో ఎన్నికల సామాగ్రి పంపిణీ వద్ద వెకంటేష్ సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయన్ను 108 సిబ్బంది వైద్య సహాయం అందించారు. మెరుగైన వైద్యం కోసం వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం సహకరించని కారణంగా వెంకటేష్‌కి ఎన్నికల విధుల నుంచి మినహాయింపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+