తెలంగాణా ఎన్నికలు: నామినేషన్ల దాఖలుకు ఈ నాలుగురోజులే భేష్!!

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన ఎన్నికల కమిషన్ నవంబర్ 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని, నవంబర్ 10వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉందని పేర్కొంది. ఆ పైన నవంబర్ 30 తేదీన పోలింగ్ జరుగుతుందని, డిసెంబర్ మూడవ తేదీన కౌంటింగ్, అదే రోజు ఫలితాలు వెలువడుతాయి అని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సమర శంఖం పూరించడంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలోకి నిలిపే అభ్యర్థుల విషయంలోనూ, ఎప్పుడు ఎవరు నామినేషన్లు దాఖలు చేయాలి అనే అంశంపైన పెద్ద ఎత్తున దృష్టి సారించాయి. అంతేకాదు ఇప్పుడు తమ జాతకం ఎలా ఉంది? ఏ సమయంలో నామినేషన్ వెయ్యాలి? ఎప్పుడు ప్రచారం మొదలు పెట్టాలి? వంటి అనేక విషయాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు.

Telangana Elections: astrological experts said these four days are best to file nominations!!

అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ మూడవ తేదీన విడుదల కానుండగా పదవ తేదీ వరకు నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారు. అయితే మూడవ తేదీ నుండి పదవ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఏ రోజు మంచిది అని తెలుసుకోవడానికి ఇప్పటికే అభ్యర్థులు జ్యోతిష్య శాస్త్ర నిపుణుల వద్దకు పరుగులు పెడుతున్నారు.

అయితే నవంబర్ నెలలో ౩, 4, 8, 9 తేదీలు నామినేషన్లు దాఖలు చేయడానికి బాగా ఉంటాయని, ఈ నాలుగు తేదీలే భేషుగ్గా ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ నాలుగు రోజులు తిథి, నక్షత్ర బలం రీత్యా బాగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు. తెలంగాణ సీఎం కెసిఆర్ కూడా తిధి, నక్షత్ర బలం చూసుకుని వేద పండితుల సూచన మేరకు నామినేషన్లను దాఖలు చెయ్యనున్నారు.

సీఎం కేసీఆర్ ఆయనకు బాగా కలిసి వచ్చే ఉత్తర నక్షత్రంతో కూడిన రోజున నామినేషన్ దాఖలు చేయనున్నారు. నవంబర్ 9వ తేదీన కేసీఆర్ అటు గజ్వేల్ లోను, ఇటు కామారెడ్డి లోను రెండు చోట్ల నామినేషన్లను దాఖలు చేయనున్నారు. ఆ రోజే ఆయనకు కలిసొచ్చే రోజుగా పండితులు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+