తెలంగాణా ఎన్నికలు: హెలికాఫ్టర్ లు, చార్టర్డ్ విమానాలకు డిమాండ్!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ రావడంతో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేయడానికి రెడీ అవుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీల నేతలు వందల సంఖ్యలో ప్రచార సభలను నిర్వహించడానికి సన్నద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో హెలికాఫ్టర్లు, విమానాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది.
ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేయడానికి వచ్చే జాతీయ నాయకులకు, స్టార్ క్యాంపెయినర్ లకు సమయాన్ని ఆదా చేయడంతోపాటు, సౌకర్యవంతంగా ప్రయాణం చేయడానికి హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలను తీసుకోవడానికి ప్రధాన పార్టీల నాయకులు సై అంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో అద్దె విమానాలకు, హెలికాప్టర్ లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో త్వరగా ప్రయాణం చేయడం కోసం అద్దె విమానాలను హెలికాప్టర్లను ఆశ్రయిస్తున్నారు. లక్షల్లో అద్దె చెల్లిస్తూ అద్దె విమానాలను బుక్ చేసుకుంటున్నారు రాజకీయ పార్టీల నాయకులు.
బ్లేడ్ ఇండియా, జెట్ సెట్ గో, అర్బన్ ఎయిర్ మొబిలిటీ, ఇండియన్ ఫ్లై సర్వీసెస్ వంటి కంపెనీలు హెలికాప్టర్లు జెట్ విమానాలను అద్దెకి ఇస్తున్నాయి . ప్రైవేట్ ఏజెన్సీ లతోపాటు సువిధ యాప్ ద్వారా హెలికాప్టర్లు, విమానాలను అద్దెకి తీసుకోవడానికి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. సాధారణంగా ఎన్నికల ప్రచారానికి బెల్ 407, ఎయిర్ బస్ హెచ్125, హెచ్ 130 హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంటుంటారు. ఈ హెలికాప్టర్లలో ఐదుగురు ప్రయాణం చేయవచ్చు.
సాధారణంగా సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ అద్దె గంటకు ఒక లక్ష యాభై వేల రూపాయల నుంచి ఉంటుంది. అదే డబుల్ ఇంజన్ అయితే 2 లక్షల 75 వేల రూపాయల వరకు ఉంటుంది. మొత్తంగా అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్న నేపథ్యంలో రాబోయే రోజులలో అద్దె హెలికాప్టర్లు, విమానాలకు డిమాండ్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే హెలికాఫ్టర్ లు, అద్దె విమానాలను ఉపయోగిస్తే ఆ ఖర్చు కూడా ఎన్నికల ఖర్చు క్రిందే పరిగణించి లెక్కిస్తారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications