Telangana Elections: కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డినేనా.. కాకుంటే మరెవరు? హాట్ డిబేట్!!

తెలంగాణ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. రాష్ట్రంలోని మెజారిటీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో నిలిచి బీఆర్ఎస్, బిజెపిలను టెన్షన్ పడుతున్నారు. ఇప్పటివరకు కొనసాగిన ఎన్నికల ఫలితాల ట్రెండును బట్టి కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సీఎం ఎవరు? రేవంత్ రెడ్డినేనా? రేవంత్ కాకుంటే మరెవరు? అన్న చర్చ రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో స్పష్టమైన ఆధిక్యాన్ని దక్కించుకుని అధికారంలోకి వస్తుందన్న విశ్వాసం ప్రస్తుత ట్రెండ్ ను బట్టి కనిపిస్తుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థుల విషయంలో కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రేసులో ముందు వరుసలో ఉన్నారు. అయితే ఆయనతోపాటు భట్టి విక్రమార్క పేరు కూడా తెర మీదకు వస్తుంది.

Telangana Elections: Is Congress CM candidate Revanth Reddy; If not, who else? Hot debate!!

సామాజిక వర్గ పరంగా తీసుకుంటే రెడ్డి సామాజిక వర్గం నుండి రేవంత్ రెడ్డి తో పాటు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ముఖ్యమంత్రి రేసులో ఉంటారు. ఒకవేళ ఎస్సీ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని భావిస్తే భట్టి విక్రమార్క పేరు ,దామోదర రాజనర్సింహ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఎస్టీ నియోజకవర్గానికి చెందిన వారికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలి అనుకుంటే మొదట వినిపించే పేరు సీతక్క.

గతంలో సీతక్కకు సీఎంగా అవకాశం ఇస్తే తప్పేమిటి అని రేవంత్ రెడ్డి మాట్లాడడం, మహిళలకు అవకాశాలు ఇస్తామని రాహుల్ గాంధీ కూడా ప్రకటించడం వంటి అంశాలు సీతక్క కు కూడా అవకాశం ఉన్నట్టుగా స్పష్టం చేస్తున్నాయి. ఇక వీరు మాత్రమే కాకుండా మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ వంటి నేతలు కూడా సీఎం పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు.

ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించిన రేవంత్ రెడ్డికి సీఎం గా అవకాశం ఇస్తేనే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి సీఎం కి అవకాశం ఇచ్చే పరిస్థితి లేకపోతే, ఎస్టి కమ్యూనిటీ నుంచి మహిళ అయిన సీతక్క కు సీఎంగా అవకాశం ఇస్తే బాగుంటుంది అన్న చర్చ జరుగుతుంది. మరి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర సీఎం గా ఎవరికి పట్టం కడుతుందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+