telangana elections: బీఆర్ఎస్ ఓటమి: కేటీఆర్ ఆసక్తికర ట్వీట్!!

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి భారీ విజయాన్ని అందించాయి. ఈ ఎన్నికలలో ఊహించని విధంగా బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలైంది. అభివృద్ధి, సంక్షేమం ప్రధానంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లినప్పటికీ, అనేక సంక్షేమ పథకాలను ప్రకటించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలి వీచింది. ప్రజలు తెలంగాణ సీఎం కేసీఆర్ ను, కేసీఆర్ పాలనను ఆదరించలేదు అనేది ప్రస్తుత ఫలితాలను బట్టి స్పష్టంగా తెలుస్తుంది.

గత రెండు దఫాలుగా బీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలు ఈసారి మార్పును కోరుకున్నారు అన్నది స్పష్టంగా తెలుస్తుంది . ఇక తాజాగా వెలువడిన ఫలితాలపై, బీఆర్ఎస్ ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

telangana elections: KTR interesting tweet on BRS defeat!!

బీఆర్ఎస్ పార్టీని ఆదరించినందుకు, అధికారాన్ని ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, రెండు పర్యాయాలు ప్రభుత్వ ఏర్పాటుకు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. తాము ఈ ఫలితం గురించి బాధ పడడం లేదని, కానీ ఎన్నికల ఫలితాలు మేము ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కచ్చితంగా నిరాశ చెందామని ఆయన వెల్లడించారు.

ఈ ఎన్నికల ఫలితాలను ఒక పాఠంగా తీసుకుంటామని, తిరిగి మళ్లీ పుంజుకుంటాం అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణా రాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. మీకు శుభం జరగాలని కోరుకుంటున్నాను అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు.

ఇక ఈ పోస్టుతో కేటీఆర్ ఓటమి సమయంలోనూ చాలా పాజిటివ్ స్పిరిట్ తో ఉన్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం కేటీఆర్ పోస్ట్ ఎక్స్ లో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే భవిష్యత్ లో మళ్ళీ పుంజుకుంటాం అని చెప్తున్న కేటీఆర్ ఏం చేస్తారు అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు ఓటమిని అంగీకరిస్తూ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాజీనామా చెయ్యనున్నారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+