కొల్లాపూర్ లో బర్రెలక్క ఖల్లాస్.. సోషల్ మీడియాలో మోతమోగినా ఓటుగా మారలేదు భయ్యా!!
తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల సంఘం అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 52 స్థానాలలో, టిఆర్ఎస్ 29 స్థానాల్లో, బిజెపి ఆరు స్థానాలలో ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. హోరాహోరీగా జరుగుతున్న పోరులో చాలా నియోజకవర్గాలలో బిజెపి కాంగ్రెస్ల మధ్య, టిఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య ప్రచ్చన్న సమరం కొనసాగుతుంది.
ఇదిలా ఉంటే ఈసారి కొల్లాపూర్ లో బర్రెలక్క అక్కడ ఉన్న అభ్యర్థులను అందరిని వణికిస్తున్నారు అని ప్రచారం జరిగిన వేళ, బర్రెలక్కకు ఉన్న క్రేజ్ ఓటు బ్యాంకుగా మారలేదని స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు బర్రెలక్కకు (కర్నె శిరీష) కు 474 ఓట్లు పోలైనట్టు సమాచారం. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకునే పరిస్థితిలో బర్రె లెక్కలేదని తాజా ట్రెండ్ చెబుతోంది.

బర్రెలక్క ఎన్నికలలో విజయం సాధించకపోయినా కనీసం 15 వేలు నుంచి ఇరవై వేల ఓట్లు వస్తాయి అని భావించినా అది కుదరలేదని తెలుస్తుంది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిన బర్రెలక్క కు దేశ విదేశాల నుంచి మద్దతు లభించినప్పటికీ, స్థానికంగా ఉన్న కొల్లాపూర్ ప్రజలు మాత్రం బర్రెలక్కకు మద్దతు ఇవ్వలేదు అనేది కౌంటింగ్ ద్వారా సుస్పష్టంగా తెలుస్తుంది.
నిరుద్యోగ అభ్యర్థుల ప్రతినిధిగా తెలంగాణ అసెంబ్లీ బరిలోకి దిగిన బర్రెలకు పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో ఉన్నప్పటికీ ఫలితాలలో మాత్రం వెనకంజలో ఉన్నారు . ప్రస్తుతం కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు లీడింగ్ కొనసాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కంటే ఎక్కువగా పాపులారిటీ సాధించిన బర్రెలక్క, లీడింగ్లో లేకపోవడం ప్రస్తుతం ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.
ఈసారి బర్రెలకు ఈ నియోజకవర్గంలో గెలిస్తే చరిత్ర సృష్టిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే ఇప్పుడు ఆమె కనీసం డిపాజిట్ అయిన దక్కించుకుంటుందా అన్న ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతుంది. ఏది ఏమైనా సోషల్ మీడియాలో మోత మోగినా అది ఓటు బ్యాంకుగా మారదు భయ్యా అని పలువురు బర్రెలక్క ఎపిసోడ్ ను విశ్లేషిస్తున్నారు.












Click it and Unblock the Notifications