తెలంగాణా ఎన్నికలు: టీడీపీ బీజేపీ పొత్తులు?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ఇప్పటికే అన్ని పార్టీలు టిక్కెట్లు కేటాయించి ముందకు పోతుంటే తెలుగుదేశం మాత్రం ఇంకా పూర్తిస్ధాయిలో సన్నద్దం కాలేదు. టిక్కెట్ల కేటాయింపులో బాగా వెనుకబడి పోయింది. తెలంగాణ రాస్ట్రంలో మళ్ళీ పూర్వవైభవం పొందేందుకు తెలుగుదేశం పార్టీ తన ప్రయత్నాలలో భాగంగా ఇటీవల రాష్ట్ర అద్యక్షుడి విషయంలో కూడామార్పు చేసింది.

తెలంగాణాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ణానేశ్వర్ ముదిరాజ్ ను రాష్ట్ర అద్యక్షునిగా నియమించి వరుస కార్యక్రుమాలతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేసింది. కానీ ఇటీవల స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టై జైలుకు వెళ్ళడంతో అగ్రనేతలంతా ఆ కేసుల మీదనే దృష్టి కేంద్రీకరించారు.

Telangana Elections: TDP BJP Alliance?

దీంతో ఇక్కడ ఎన్నికల వ్యూహాలు అమలుకావడం లేదు. దీనికి తోడు ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కావడం తో ఈరెండు పార్టీ నడుమ పొత్తుల గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి తోడు చంద్రబాబు అరెస్టు విషయంలో ఆపార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్ ఢిల్లీ యాత్ర చేశారు.

తాజాగా అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు. దీంతో తెలుగు తమ్ముళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ప్రస్తుతం ఉన్న సమస్యల నుండి బయటపడవచ్చని భావిస్తున్నారు. ఇక తెలంగాణలో కూడా బీజేపీతో పొత్తుతో వెళ్తే పార్టీ ఉనికి ఉంటుందన్న చర్చ జరుగుతుంది. ఈ విషయంలో కూడా పుకార్లు షికారు చేస్తున్నాయి.

దీంతో పొత్తులపై తెలుగుదేశం శ్రేణులు కొంత సానుకూలంగా కనబడినప్పటికీ బిజెపి నేతలు మాత్రం టిడిపితో పొత్తుకు అంత సుముఖంగా కనిపించడం లేదు. దీంతో ఏఏ స్ధానాలలో ఎవరెవరు పోటీ చేయాలనే అంశంపై కూడా సందిగ్దం నెలకొంది. ప్రస్తుతం పొలిటికల్ కాంపౌండ్ లో వినిపిస్తున్న ఊహాగానాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ణానేశ్వర్ పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది.

కాని అదేస్ధానం నుంచి బిజెపినేత కూన శ్రీశైలం గౌడ్ కూడా పోటీకి సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్ధితులలో ఒకవేళ పొత్తులు కుదిరితే ఎవరో ఒకరు సీటు ను త్యాగం చేయాల్సిన పరిస్దితి ఏర్పడుతుంది. ఆలస్యం అయ్యే కొద్దీ అభ్యర్థులు కూడా పక్కచూపులు చూసే అవకాశం ఉన్నందున పొత్తులు, సీట్లు తేల్చాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+