తెలంగాణా ఎన్నికలు: గెలిచేదెవరు? హాట్ టాపిక్!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలలో గెలిచేది ఎవరు? ఏ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో విజయకేతనం ఎగర వేస్తుంది? అన్నది రాష్ట్రవ్యాప్తంగా ప్రజలలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూలు రావడంతో అన్ని రాజకీయ పార్టీలు దూకుడును మరింత పెంచాయి.
ఈసారి ఎలాగైనా తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుని మూడోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని బీఆర్ఎస్ భావిస్తుంది. దీంతో బీఆర్ఎస్ ఈసారి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికలు కాంగ్రెస్, బిజెపిలకు చావో రేవో కావడంతో ఈ రెండు పార్టీలు అధికారం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్ల మనసు గెలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్న ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అన్నదానిపై రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్కరు కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. పాలనా పగ్గాలు చేపట్టి పదేళ్లుగా పాలన సాగిస్తున్న బీఆర్ఎస్ ప్రజల అంచనాలకు తగ్గట్టుగా పని చేసిందా? ఈసారి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మళ్లీ గద్దెనెక్కిస్తారా? అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి.
బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ పై ఆశలు పెట్టుకున్నప్పటికీ ఈసారి బీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ దాటదు అన్న అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉన్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకునే స్థానాలను సొంతం చేసుకుంటుందా? అంటే అది కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
ఇక మొన్నటి వరకు దూకుడుగా ముందుకు వెళ్లిన బిజెపి, ఇప్పుడు రాష్ట్రంలో మూడవ స్థానానికి పడిపోయింది. ఈ సమయంలో బిజెపి గ్రాఫ్ మళ్ళీ పెరుగుతుందా? బి ఆర్ ఎస్ ను బిజెపి ధీటుగా ఎదుర్కొంటుందా? వచ్చే ఎన్నికల్లో బిజెపి సత్తా చాటుతుందా అంటే అది కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి. బీజేపీ మళ్ళీ పట్టు సాధించటం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
దీంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికలలో విజయలక్ష్మి ఎవరిని వరిస్తుంది అన్నది తెలంగాణ ప్రజలలో ఆసక్తికరంగా మారింది. మెజార్టీ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారన్నది ఆసక్తిక విషయమే కానీ ప్రజల్లోనే ప్రస్తుత పరిస్థితిపై గందరగోళం నెలకొంది.












Click it and Unblock the Notifications