మద్యం షాపులకు నోటిఫికేషన్, ఫీజులు - ఎక్కడెక్కడ..మార్గదర్శకాలు.!!
తెలంగాణ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దసరా వేళ కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాలను లాటరీ పద్దతిలో తీసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు టెండర్ ఫీజులను ఖరారు చేసారు. కొంత కాలంగా మద్యం దుకాణాల నోటిఫికేషన్ పైన ఎక్సైజ్ శాఖ కసరత్తు చేసింది. రెండేళ్ల పాటు దుకాణాలు నిర్వహించేందుకు వీలుగా కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ జారీ అయింది.
తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేసారు. రేపటి (శుక్రవారం) నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23వ తేదీన డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయించనున్నారు. కొత్త దుకాణాలకు 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ కాల పరిమితిగా నిర్ణయించారు. అలాగే టెండర్ ఫీజును రూ.3 లక్షలుగా నిర్ణయించారు. గతంలో టెండర్ ఫీజు రూ.2లక్షలు ఉండగా.. ఇప్పుడు ఒక లక్ష అదనంగా పెంచుతూ మూడు లక్షలుగా తేల్చారు. అలాగే ఫీజు మొత్తాన్ని ఒకేసారి కాకుండా ఆరు విడతలుగా చెల్లించే వెసులుబాటు కల్పించారు. దీంతో.. మద్యం వ్యాపారులు మరింత ఎక్కువ సంఖ్యలో ముందుకు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సారి మద్యం దుకాణాలకు పోటీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్స్ గడువు నవంబర్ 30తో ముగియనుంది. అలాగే ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం శిక్ష పడిన వారు మద్యం దుకాణాలు పొందడానికి అనర్హులుగా పరిగణించబడతారు. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాల్లో గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు ఉంటాయి. దీంతో.. పూర్తి విధి విధానాలతో ఈ సారి ఎలాంటి వివాదాలకు అవకాశం లేకుండా టెండర్లు... షాపుల కేటాయింపు పూర్తి చేసేందుకు ఎక్సైజ్ శాఖ తుది కసరత్తు చేస్తోంది. అయితే.. కల్లు గీత కార్మికులు, ఎస్సీలు, ఎస్టీలకు ప్రత్యేకంగా షాపులు కేటాయించటంతో.. ఎలాంటి స్పందన వస్తుందనేది కీలకంగా మారుతోంది. ఎక్సైజ్ విధానంలో మార్పులు చేస్తూ.. రెవిన్యూ పెంపు కోసం ప్రయత్నాలు చేస్తున్న అధికారులు ఈ సారి టెండర్ల పైన భారీ అంచనాలతో ఉన్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications