రైతులకు శుభవార్త.. ఇకపై తెలుగులోనే ఏఐ.. రైతన్నకు అండగా!

తెలంగాణ రైతులకు శుభవార్త. రైతులకు ఇకపై సాగుకు సంబంధించిన సమాచారం, సలహాలు తెలుగులోనే అందుబాటులోకి రానున్నాయి. కృత్రిమ మేధ ఆధారిత జాతీయ వేదిక 'భారత్ విస్తార్'ను రాష్ట్రంలో అమలు చేయడానికి వ్యవసాయ శాఖ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నమెంట్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

గురువారం సచివాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌ల సమక్షంలో వ్యవసాయ సంచాలకుడు గోపి, ఎన్‌ఐఎస్‌జీ సీనియర్ జనరల్ మేనేజర్ షేక్ రషీద్ బాషా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. భారత్ విస్తార్ అనేది కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ రూపొందించిన జాతీయ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇందులో ఐసీఏఆర్, ఐఎండీ, అగ్రిమార్కెట్, సాయిల్ హెల్త్ కార్డులు, కేంద్ర పథకాలు వంటి అనేక వ్యవస్థల సమాచారం ఒకే చోట ఉంటుంది.

Telangana Farmers to Get AI-Powered Agri Advice in Telugu via Bharat Vistaar Platform

ఏఐ వాయిస్ అసిస్టెంట్ 'భారతి' రైతులతో తెలుగులో సంభాషిస్తూ సమాధానాలు ఇస్తుంది. రైతు తన సమస్యను మాట్లాడి లేదా టైప్ చేసి అడిగితే, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సలహాలు అందుతాయి.ఈ వేదిక ద్వారా ఆరు ప్రధాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఏ ప్రాంతంలో ఏ పంట సాగు చేయాలి, ఎప్పుడు విత్తుకోవాలి, విత్తనాల ఎంపిక, ఎరువులు, నీటి యాజమాన్యం, నేలలో పోషకాల స్థితి వంటి శాస్త్రీయ సలహాలు లభిస్తాయి.

వాతావరణ మార్పులపై ముందస్తు హెచ్చరికలు, చీడపీడల గుర్తింపు, నివారణ చర్యలు, అగ్రిమార్కెట్ ద్వారా మార్కెట్ ధరలు, కేంద్ర పథకాల అర్హత, దరఖాస్తు స్థితి, లబ్ధి వివరాలు కూడా తెలుస్తాయి. రైతులు పంట ఫోటోలు పంపితే ఏఐ ద్వారా తెగుళ్లు గుర్తించి సూచనలు ఇవ్వగలదు.సేవలు నాలుగు మార్గాల్లో అందుతాయి. ప్రస్తుతం ఉన్న 155261 హెల్ప్‌లైన్‌కు తెలుగు వాయిస్ బాట్ సేవలు విస్తరిస్తారు.

ఒప్పందం జరిగిన 15 నుంచి 21 రోజుల్లో ప్రత్యేక వెబ్ పోర్టల్, తెలుగు మొబైల్ యాప్ ప్రారంభం కానున్నాయి. 45 నుంచి 60 రోజుల్లో వాట్సాప్ చాట్‌బాట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. సాధారణ ఫోన్ ఉన్న రైతుల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో స్మార్ట్‌ఫోన్ లేని వారు కూడా వాయిస్ కాల్ ద్వారా సలహాలు పొందవచ్చు.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, సాంకేతికతను రైతులకు దగ్గర చేయడం ద్వారా సాగు ఖర్చు తగ్గించి, దిగుబడులు, ఆదాయం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

తెలంగాణలోని ప్రాంతీయ వాతావరణం, నేలల స్వభావం, పంటల వైవిధ్యం, స్థానిక సాగు పద్ధతులు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఈ వేదికను మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. రైతుల దరఖాస్తులు, పథకాల లబ్ధి, చెల్లింపులు, ఫిర్యాదుల స్థితి వంటి వివరాలను కూడా రాష్ట్ర వ్యవస్థలతో అనుసంధానం చేస్తారు.దీంతో రైతులు సమయానుకూలంగా సరైన సమాచారం పొంది, అనవసర ఖర్చులు తగ్గించుకోవచ్చు.

రూ.232.7కోట్లతో హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్!
రూ.232.7కోట్లతో హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్!

చీడపీడలను ముందుగానే గుర్తించి నివారించడం వల్ల పంట నష్టం తగ్గుతుంది. ఎరువులు, పురుగుమందులు అవసరమైన మేరకే వాడటం వల్ల ఖర్చు తగ్గి, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించి, రైతుల ఆదాయం పెంచే దిశగా ఇది ముఖ్యమైన అడుగు. సేవలు త్వరలోనే అందుబాటులోకి రావడంతో రైతులు ఎంతో లబ్ధి పొందనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+