ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్, వారికి ఈ నెల జీతం కట్..!!
ప్రభుత్వం లో పని చేస్తున్న ఉద్యోగులకు బిగ్ అలర్ట్. తెలంగాణ ఆర్దిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులకు కీలక సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వంలో పని చేస్తున్న ఉద్యోగుల వివరాలను సేకరించాలని సూచించింది .ఇంకా నమోదు చేయని వారికి ఈ నెల జీతం రాదంటూ అన్ని శాఖల కు ఆర్దిక శాఖ హెచ్చరించింది. గత నెలలోనే సమాచారం ఇచ్చినా.. ఇంకా సగానికి పైగా ఉద్యోగుల నుంచి వివరాలు అందలేదు. దీంతో, ఆర్దిక శాఖ తాజా హెచ్చరిక చేసింది.
తెలంగాణ ప్రభుత్వంలో పని చేస్తున్న ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని సెప్టెంబర్ లో ఆర్దిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని శాఖల్లో కలిపి శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు మొత్తం 10 లక్షల 14 వేల మంది ఉన్నారు. కాగా, ఈ ఉద్యోగుల అందరి పేర్లు, వారి హోదా, ఆధార్, ఫోన్ నంబర్లు తదితర వివరాలన్నీ ప్రతి నెల 10 వరకు ఆర్థికశాఖ నిర్వహణ పోర్టల్ (ఐఎఫ్‌ఎంఐఎస్)లో నమోదు చేయాలని గత నెల సెప్టెంబరులో ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఈ నెల 16 వరకు సగం మంది వివరాలు కూడా పోర్టల్లో నమోదు చేయలేదు. దీంతో.. వివరాలివ్వని ఉద్యోగుల జీతాల బిల్లులు ఈ నెలలో ఆమోదించే ప్రసక్తే లేదని ఆర్థిక శాఖ హెచ్చరించింది.

ప్రభుత్వంలో 5.21 లక్షల మంది శాశ్వత ఉద్యోగులకు గాను 2.22 లక్షల మంది, 4.93 లక్షల మంది తాత్కాలిక ఉద్యోగులకు గాను 2.74 లక్షల మంది వివరాలు మాత్రమే నమోదయ్యాయి. ఏ ఒక్క శాఖ కూడా వందశాతం ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు. ఉద్యోగుల సమగ్ర వివరాలన్నీ లేకపోవడంతో కొన్నిచోట్ల అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వానికి ఎప్పుడూ ఫిర్యాదులు అందుతున్నాయి.
కొన్ని కార్యాలయాల్లో తాత్కాలిక ఉద్యోగులు మానేసినా, అనధికారికంగా సుదీర్ఘ సెలవులో వెళ్లినా వారి పేర్లతో వేతనాలు డ్రా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేరు, ఆధార్, సెల్ నంబర్లతో పోల్చిచూసేందుకు వివరాలు కోరారు. వేతనం వచ్చే నెల ఒకటో తేదీన విడుదల కావాలంటే ప్రతి ఉద్యోగి వివరాలు కచ్చితంగా పంపి తీరాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఇలా ప్రతినెల పదో తేదీలోగా ఉద్యోగుల వివరాలను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని వెల్లడించింది.












Click it and Unblock the Notifications