తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం వేదికగా కేసీఆర్ ఎన్నికల శంఖారావం; ప్లాన్ రెడీ!!
జూన్ రెండవ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యి 10 వ సంవత్సరంలోకి వచ్చే జూన్ 2వ తేదీకి అడుగుపెట్టనుంది. సీఎం కేసీఆర్ జూన్ 2వ తేదీ చరిత్రలో నిలిచిపోయే విధంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేశారు. రాష్ట్ర దశాబ్ది వేడుకల పేరుతో ఉత్సవాలు నిర్వహించాలని సీఎం కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం.
ఈ సంవత్సరం ఎన్నికల ఏడాది కావడంతో, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవ నినాదం వంటి అంశాలను ప్రజలకు గుర్తు చేయడానికి జూన్ 2వ తేదీన వేదికగా చేసుకోవాలని సీఎం కేసీఆర్ కొత్త స్ట్రాటజీ తో ప్రజల వద్దకు వెళ్లనున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు అధికారులకు ఇప్పటినుంచి దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.

అయితే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎన్ని రోజులు నిర్వహించాలి అన్నదానిపై ఇంతవరకూ ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ రాష్ట్రస్థాయిలో మాత్రమే కాకుండా గ్రామ స్థాయిలోనూ వేడుకలు నిర్వహించడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వేదికగా చేసుకుని ఎన్నికల సమర శంఖారావం పూరించాలని సీఎం కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ ఏర్పడిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని, అక్కడ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను ప్రజలకు మరోమారు అర్థమయ్యేలా చెప్పాలని, పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. కెసిఆర్ పాలనలో రాష్ట్రం ఏవిధంగా ప్రగతి పథంలో ముందుకు సాగుతుంది? పారిశ్రామికంగా ఏ విధంగా అభివృద్ధి చెందింది? వంటి విషయాలను ప్రజలకు చెప్పాలని భావిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన పలు సంక్షేమ పథకాలను సభలు, సమావేశాలు నిర్వహించి అందరికీ అర్థమయ్యేలా వివరించి చెప్పాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకు కొద్ది నెలలు మాత్రమే సమయం ఉండటంతో సీఎం కేసీఆర్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడానికి వేదికగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటే, రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు సమాయత్తమవుతున్నాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications