టీకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు: ఆదిభట్లలో విమాన ఇంజిన్ల తయారీ

Recommended Video

    వైమానిక ఇంజిన్ల తయారీ @ఆదిభట్ల

    హైదరాబాద్: తెలంగాణలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు దక్కింది. వైమానిక రంగంలో ప్రసిద్ధ సంస్థలైన జీఈ ఏవియేషన్‌, టాటా అడ్వాన్స్‌ సిస్టం లిమిటెడ్‌తో కలిసి హైదరాబాద్‌ శివారు ఆదిభట్లలో వైమానిక ఇంజిన్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు గురువారం ముంబైలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.

    ఈ ఒప్పందంపై జీఈ సంస్థ ఛైర్మన్‌ జాన్‌ ఎల్‌ ఫ్లానరీ, టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌లు సంతకాలు చేశారు. అమెరికాకు చెందిన జీఈ ఏవియేషన్‌ సంస్థ వాణిజ్య, సైనిక, వ్యాపార, పౌర విమానాలు, జెట్‌ విమానాల ఇంజిన్ల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.

     కేటీఆర్ కృషి.. దేశంలోనే తొలిసారి

    కేటీఆర్ కృషి.. దేశంలోనే తొలిసారి

    కాగా, దేశంలోనే తొలిసారిగా అత్యున్నత నాణ్యత గల సీఎఫ్‌ఎం లీప్‌ ఇంజిన్లు, వాటి విభాగాల తయారీ, అసెంబ్లింగ్‌, టెస్టింగ్‌ పరిశ్రమతో పాటు ప్రతిభా కేంద్రం (సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కృషి ఫలితంగా ఈ పరిశ్రమ రాష్ట్రానికి దక్కింది. కేటీఆర్‌ గత సంవత్సర కాలంగా వైమానిక పరిశ్రమను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని జీఈ సంస్థను కోరుతున్నారు. నిరుడు అమెరికా పర్యటన సందర్భంగా ఆ సంస్థ ఛైర్మన్‌ జాన్‌ ఎల్‌.ఫ్లానరీతో భేటీ అయి ఈ మేరకు విన్నవించారు. బుధవారం ఢిల్లీలోనూ ఆయన మరోసారి ఫ్లానరీని కలిసి ఈ అంశాన్ని ప్రస్తావించారు. కేటీఆర్‌ వినతిని పరిగణనలోకి తీసుకుని పరిశ్రమ స్థాపనకు హైదరాబాద్‌ను ఎంపిక చేశారు.

     ఆదిభట్లలోనే..

    ఆదిభట్లలోనే..

    హైదరాబాద్‌ శివార్లలోని ఆదిభట్లలో టాటా సంస్థ వైమానిక సెజ్‌లు ఉన్నాయి. వాటిలో హెలికాప్టర్ల విడిభాగాలు సహా వైమానిక ఉత్పత్తులు తయారుచేస్తున్నారు. దీనిని పరిగణనలోకి తీసుకొని జీఈ వినతి మేరకు టాటా సంస్థ.. తమ వైమానిక సెజ్‌లో తాజా పరిశ్రమ ఏర్పాటుకు పది ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది. ప్రాథమిక పెట్టుబడి రూ. మూడు వేల కోట్లుగా అంచనా వేశారు. లీఫ్‌ ఇంజిన్లు ప్రస్తుతం చైనా, కొరియా, జపాన్‌ల్లో మాత్రమే తయారవుతున్నాయి. దేశంలో తొలిసారిగా వీటిని హైదరాబాద్‌లో ఉత్పత్తి చేయనున్నారు. వచ్చే ఫిబ్రవరిలో ఈ పరిశ్రమకు శంకుస్థాపన చేసి, వెంటనే పనులు చేపడతారు. ఏడాదిలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తారు. వైమానిక ఇంజిన్లను భారత్‌తోపాటు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు.

    మేక్ ఇన్ ఇండియా..

    భారత్‌లో తయారీ (మేక్‌ ఇన్‌ ఇండియా) స్ఫూర్తితో భారత్‌లో తమ కొత్త ప్రాజెక్టు చేపడుతున్నామని ఒప్పందం సందర్భంగా ఫ్లానరీ తెలిపారు. టాటా సంస్థ భారతదేశ రక్షణ, వైమానిక రంగాల్లో అగ్రగామిగా ఉందని, లీఫ్‌ ఇంజిన్లకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో తమ సంస్థ టాటాతో చేసుకున్న ఒప్పందం ద్వారా నిర్ణీత లక్ష్యాలను చేరుకుంటామని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేస్తామన్నారు. జీఈతో భాగస్వామ్యం ద్వారా రక్షణ, వైమానిక రంగాల్లో భారత్‌ మరింత పురోగమిస్తుందని టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ చెప్పారు. భారత రక్షణ దళాల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తుల తయారీకి తాజా ఒప్పందం దోహదపడుతుందని వివరించారు.

     జీఈ, టాటా సంస్థలకు కృతజ్ఞతలు

    జీఈ, టాటా సంస్థలకు కృతజ్ఞతలు

    జీఈ సంస్థ, టాటాల మధ్య ఒప్పందం సమాచారం తెలియగానే మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధికి దోహదపడే అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకున్నందుకు జాన్‌ ప్లానరీ, చంద్రశేఖరన్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో వైమానిక రంగానికి ఈ ఒప్పందం ఊతమిస్తుందన్నారు. భారత్‌లో తయారీలో భాగమైన తెలంగాణలో తయారీ లక్ష్యాల సాధనకు ఇది ఉపకరిస్తుందని తెలిపారు. బుధవారం జరిగిన భేటీ సందర్భంగా జాన్‌ఫ్లానరీ తెలంగాణకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారని చెప్పారు. తెలంగాణ ఏరో స్పేస్ తయారీ రంగానికి మొదటి నుంచి అండగా ఉన్న టాటాసంస్థకు , రతన్‌టాటాకు, చైర్మన్ చంద్రశేఖరన్‌కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

    జీఈ ఇంజిన్లు కీలకమే..

    జీఈ ఇంజిన్లు కీలకమే..

    భారత్‌లో జీఈ ఇంజిన్లు ఎంతో కీలకంగా మారాయి. ప్రస్తుతం వైమానికదళానికి చెందిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్ ఎంకే-1, నావికాదళానికి చెందిన పీ-8ఐ విమానం, పీ-17 సివాలిక్ క్లాస్ ఫ్రిగేట్స్ సహా భారత సైనిక వ్యవస్థలకు అవసరమైన జెట్‌ఇంజిన్లు, మెరైన్ గ్యాస్ టర్బైన్లను జీఈ అందజేస్తున్నది. అలాగే తేజస్ ఎంకే-2, పీ-17ఏ, పీ-71 నౌకలు, ఏహెచ్-64 ఎటాక్ హెలికాప్టర్లు సహా ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న పలు సైనికవ్యవస్థలు కూడా జీఈ ఇంజిన్లతోనే నడవనున్నాయి. మరోవైపు ఏరోస్పేస్, డిఫెన్స్, హోంల్యాండ్ సెక్యూరిటీ తదితర రంగాల్లో దేశానికి అవసరమైన కొన్ని వ్యవస్థలను అందజేస్తున్న టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్.. బోయింగ్ లాంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలకు కీలక భాగస్వామిగా మారడం ద్వారా గ్లోబల్ ఏరోస్పేస్ మార్కెట్‌లో ప్రముఖమైన శక్తిగా ఎదిగిన విషయం తెలిసిందే. లీప్ ఇంజిన్లను ఉత్పత్తి చేస్తున్న సీఎఫ్‌ఎం ఇంటర్నేషనల్ సంస్థలో జీఈతో పాటు సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ సంస్థకు చెరిసగం వాటా ఉంది. ప్రస్తుతం 140కి పైగా విమానాలను నడుపుతున్న 26 విమానయాన సంస్థలు సీఎఫ్‌ఎం ఇంటర్నేషనల్‌కు ఖాతాదారులుగా ఉన్నాయి. ప్రపంచంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, అత్యంత ఇంధన పొదుపు సామర్థ్యాన్ని కలిగివున్న జెట్ ఇంజిన్లలో లీప్ ఇంజిన్ మేటిగా ఉందని టాటా గ్రూపు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ వ్యూహాత్మక ఒప్పందం ద్వారా జీఈ ఏవియేషన్ , హైదరాబాద్‌లో ఉన్న టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్(టాసిల్) కలిసి ఎయిర్ క్రాఫ్ట్ కాంపొనెంట్స్ తయారీ, అసెంబ్లింగ్, టెస్టింగ్ వంటి రంగాల్లో కలిసి పనిచేస్తాయి. దీంతోపాటు కొత్తగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుచేసి ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ తయారీకి అవసరమైన ఎకో సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తారు. ఇక్కడి నుంచి తయారుచేయనున్న ఈ ఇంజిన్ ప్రపంచంలోనే ప్రముఖమైన ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్‌గా పేరు పొందింది. ఈ రంగంలో రానున్న ఇతర భాగస్వామ్యాలకు కూడా ఈ ఇంజిన్ తయారీ అంశం కీలకంగా మారుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+