కొత్త రైల్వే వంతెనలకు గ్రీన్ సిగ్నల్.. ఆ ప్రాంతానికి మహర్దశ!

తెలంగాణ రాష్ట్రంలో రైల్వే పురోగతికి అడుగులు పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక ప్రాజెక్టులతో రైల్వే తెలంగాణ ప్రజలకు సానుకూలమైన, ప్రయాణ సౌకర్యాన్ని ఇచ్చే నిర్ణయాలు తీసుకుంటుండగా, తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైల్వే వంతెనల నిర్మాణం పైన కేంద్రం సానుకూలంగా స్పందించింది.

రైల్వే శాఖా మంత్రికి కామారెడ్డి ఎమ్మెల్యే విజ్ఞప్తి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతున్న దృష్ట్యా స్థానిక ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసారు. ఈ సందర్భంగా కామారెడ్డి లో వివిధ వంతెనల నిర్మాణానికి సంబంధించి వినతి పత్రాన్ని మంత్రికి అందించారు. పట్టణంలో రైల్వే లైన్ల కారణంగా అనేక కాలనీల మధ్య రాకపోకలకు ఇబ్బందులు ఉన్నాయని ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి కేంద్రమంత్రికి వివరించారు.

Telangana Gets Positive Response from Centre on Kamareddy Railway Bridges Proposal

మూడు రైలు వంతెనల నిర్మాణం కోసం
కామారెడ్డి పట్టణంలో ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన చెప్పారు. కామారెడ్డిలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి మూడు రోడ్డు ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం ఎమ్మెల్యే ప్రతిపాదించారు. స్నేహపురి కాలనీ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు మొదటి వంతెన ప్రతిపాదన ఉంది. వికాస్ నగర్ కాలనీ నుండి ఇస్లాంపూర్ వరకు రెండవ రైల్వే వంతెన నిర్మించడం ద్వారా కాలనీలో ప్రజల రాకపోకలు సులభతరం అవుతాయి.

సానుకూలంగా స్పందించిన అశ్వినీ వైష్ణవ్
ఇది మాత్రమే కాకుండా పాత రాజంపేట రైల్వే గేట్ వద్ద మూడవ రోడ్డు ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని ఎమ్మెల్యే కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఇది పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతుందని, అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే రమణారెడ్డి చేసిన విజ్ఞప్తిపైన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. ఈ నిర్మాణాలకు వెంటనే నిధులు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

రైల్వే వంతెనల నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్యకు చెక్
ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి రైల్వే అధికారులు త్వరలో కామారెడ్డి ని సందర్శించి స్థల పరిశీలన చేయాలని మంత్రి ఆదేశించినట్లు కామారెడ్డి ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇక ఈ రైల్వే వంతెనలు నిర్మాణం జరిగితే కామారెడ్డి పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీరుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+