భవిష్యత్ కు పచ్చహారం - సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం..!!
ప్రపంచ దేశాలకు వాతావరణం, పర్యావరణ పరిరక్షణ సవాలుగా మారింది. ఇందుకు తెలంగాణ రాష్ట్రం కూడా మినహాయింపు కాదు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో చెరువులు కబ్జాకు గురికావడం, చెరువులను పూడ్చి భవంతులను నిర్మించడం వంటివి యదేచ్ఛగా సాగాయి. ముఖ్యంగా హైదరాబాదు మహానగరంలో చెరువులు భారీగా కబ్జాకు, ఆక్రమణలకు గురయ్యాయి. దీంతో భారీ వర్షాలు కురిసినప్పుడు హైదరాబాదు నగరానికి అపార నష్టం వాటిల్లేది. అయితే 2023లో రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వాతావరణం, పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత తీసుకుంది. ఓ వైపు సుస్థిర అభివృద్ధితో పాటు పర్యావరణాన్ని కాపాడేందుకు పలు చర్యలు తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పర్యావరణ సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టి కేంద్రీకరించడం వల్ల పట్టణ ప్రణాళిక, పునరుత్పాదక ఇంధనం, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పునరుద్ధరణలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. తెలంగాణ పచ్చదనంతో కళకళలాడుతోందని చెప్పొచ్చు. స్వతహాగా ప్రకృతి ప్రేమికులైన సీఎం రేవంత్ రెడ్డి పర్యావరణం పరంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు.
నీటి సరస్సులకు పునరుజ్జీవం
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి పర్యావరణం, చెరువుల పరిరక్షణకై వేగవంతంగా అడుగులు వేశారు. ఇప్పటికే 75 సరస్సుల పునరుద్ధరణ జరిగింది. ఇంకా 2000 చెరువులను పునరుద్ధరించేందుకు పనులు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో చెరువులు తిరిగి నీటితో కళకళలాడుతున్నాయి.తద్వారా జీవవైవిధ్యం గాడిలో పడటమే కాకుండా భూగర్భ జలాలు సైతం నిండుతున్నాయి.ఇక ఏటా శీతాకాలంలో ప్రత్యేక అతిథులుగా వచ్చే కొన్ని విదేశీ పక్షులు కొన్నేళ్లుగా ఇక్కడకు రావడం మానేశాయి. అయితే రేవంత్ రెడ్డి చొరవతో తిరిగి వలస పక్షులు తెలంగాణకు వస్తున్నాయి. ఇవి రావడంలో హైడ్రా కీలక పాత్ర పోషించింది. సరస్సులు కొత్త కళను సంతరించుకోవడంతో విదేశీ పక్షులైన ఫ్లెమింగోలు, రెడ్ బ్రెస్టెడ్ ఫ్లైక్యాచర్‌ల వంటి జాతులు తిరిగి దర్శనమిస్తున్నాయి.రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ చొరవ ప్రకృతికి మానవాళికి చాలా ప్రయోజనం చేకూరుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. హైదరాబాద్ అమీన్‌పూర్ చెరువులో కొన్నేళ్ల తర్వాత రెడ్ బ్రెస్టెడ్ ఫ్లైక్యాచర్ వంటి పక్షులు కనిపించడం సంతోషదాయకమన్నారు.అంటే చెరువులను పరిరక్షించడంతోనే ఇలాంటి పక్షులు తిరిగి ఇక్కడికి వస్తున్నాయనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. రేవంత్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని కొనియాడుతున్నారు.
కాలుష్య నియంత్రణ కోసం విద్యుత్ వాహనాలు
కాలుష్య నియంత్రణ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పలు విధానాలను తీసుకొచ్చింది. ముందుగా ప్రజారవాణ వ్యవస్థను విద్యుదీకరణ చేయాలనే ఉద్దేశంతో కాలుష్య కారక డీజిల్ బస్సుల స్థానంలో బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాల(EV)ను ప్రవేశపెట్టింది. దీంతో కాలుష్య కోరల్లో చిక్కుకున్న హైదరాబాద్ లాంటి మహానగరంలో కాలుష్యం గణనీయంగా తగ్గిందనే అభిప్రాయం ఉంది.హరిత రవాణాపై దృష్టి సారించిన ప్రభుత్వం సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు ప్రణాళిక రూపొందించింది.పాదచారులకు ప్రత్యేక జోన్లను అభివృద్ధి చేస్తున్నారు.తద్వారా హైదరాబాద్ నగరం హరిత నగరంగా అభివృద్ధి అవుతుందనే సంకేతాలు పంపుతూ మోడల్ గ్రీన్ సిటీగా రూపుదిద్దుకుంటుందని ప్రభుత్వం చెబుతోంది.
I always believed that if we take care of nature, nature will take care of us. It is farmer’s wisdom.
— Revanth Reddy (@revanth_anumula) December 2, 2024
We stopped lake encroachments after years of constant depletion and destruction of our water bodies, our ecological wealth, our legacy for our future in the last few months.… pic.twitter.com/GgFCj64wYG
పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం-వాతావరణం స్థితిస్థాపకత
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చెట్లను పెంచడంపై దృష్టి సారించడంతో పట్టణ ప్రాంతాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. హైదరాబాదులో ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకునేలా వాతావరణ స్థితిస్థాపకత విధానాలను అమలు చేస్తోంది ప్రభుత్వం.వడగాలుల నుంచి వరదల నియంత్రణ వ్యవస్థ వరకు వాతావరణంను కాపాడేందుకు ప్రపంచస్థాయి ఆలోచనలతో ముందుకు వచ్చి వాటిని అమలు చేస్తోంది.
నీటి నిల్వలు-స్థిరమైన నివాసం
తెలంగాణ ప్రభుత్వం గృహ సముదాయాల నుంచి కార్బన్ కారకాల విడుదలను పూర్తిగా అరికట్టడంపై దృష్టి సారించింది.ఇదొక గేమ్ ఛేంజర్ కానుంది. పునరుత్పాదక శక్తి, వ్యర్థాల నిర్వహణ, సాంకేతికతతో కూడిన నీటి సంరక్షణ కలగలిపి పర్యావరణంపై ఎలాంటి ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటోంది రేవంత్ సర్కార్.ఇక వర్షపు నీటిని నిల్వ ఉంచడంతో ఇటు పట్టణ ప్రాంతాల్లో అటు గ్రామీణ ప్రాంతాల్లో నీటి కొరత లేదా నీటి సమస్య తగ్గుముఖం పట్టింది.
సౌరశక్తి - పునరుత్పాదక శక్తి
తెలంగాణలోని సోలార్ ప్లాంట్‌లను ఎనర్జీ గ్రిడ్‌కిందకు తీసుకురావడం వల్ల కార్బన్ కారకాల విడుదల చాలా వరకు తగ్గింది.పునరుత్పాదక శక్తి ఫార్ములాను ఆశ్రయించడం ద్వారా తెలంగాణ రాష్ట్రం శిలాజ ఇంధనాలపై ఆధారపడటం చాలా వరకు తగ్గిపోయింది. అదే సమయంలో భవిష్యత్తు తరాలకు పునరుత్పాదక శక్తి భద్రతకు సంబంధించి భరోసా కల్పిస్తోంది.
ఎకో టూరిజం- గాంధేయ ఆదర్శాలు
హైదరాబాదు నగరంలో బాపు ఘాట్ వంటి యాత్రా స్థలాలపై ప్రత్యేక దృష్టి సారించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పర్యావరణ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసింది. పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా తీసుకుని పనిచేయడం వల్ల ఇలాంటి ప్రాంతాల్లో స్థిరత్వం, సాంస్కృతిక వారసత్వాలు విరాజిల్లుతాయని చాటుతోంది. ఇలాంటి పర్యాటక కేంద్రాలను సందర్శించడం ద్వారా సందర్శకులు ఆహ్లాదకరమైన ప్రకృతి ఆస్వాదించడమే కాకుండా చరిత్రతో పాటు పర్యావరణ సారథ్యం యొక్క తత్వాలను ఇనుమడింప చేసుకునే అవకాశం వస్తుంది.

వ్యర్థాల నిర్వహణ:నగరాల శుభ్రత, పర్యావరణ పరిరక్షణ
తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛతకు పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చింది. వ్యర్థాలను వేరుచేయడం, రీసైక్లింగ్ చేయడం, ఆ తర్వాత మిగిలిన వ్యర్థాలను బాధ్యతాయుతంగా డిస్పోజ్ చేయడంవంటి చర్యలు తీసుకుంది.ఈ చర్యలతో పట్టణ ప్రాంతాల్లో కాలుష్యం తగ్గుముఖం పట్టింది.దీంతో పర్యావరణాన్ని కాపాడగలుగుతోంది.
భారత్ భవిష్యత్తు రాష్ట్రంగా తెలంగాణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాతావరణం,పర్యావరణ పరిరక్షణ పట్ల తీసుకుంటున్న చొరవ నిజంగా రాష్ట్రానికి వరం అనే చెప్పాలి. గత పాలకులు వాతావరణం, పర్యావరణాన్ని విస్మరించారని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.జీవవైవిద్య వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు తీసుకుంటున్న చర్యలు,పునరుత్పాదక శక్తి, స్థిరమైన పట్టణ ప్రణాళికతో రాష్ట్ర ఆర్థిక వృద్ధి పర్యావరణ పరిరక్షణ కలిసికట్టుగా పయనిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.
పర్యావరణాన్ని కాపాడేందుకు తెలంగాణ రథసారథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపుతున్న చొరవ, తీసుకుంటున్న నిర్ణయాలతో వాతావరణ సవాళ్లను సులభంగా ఎదుర్కొన
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో సమూల మార్పులు కనిపిస్తున్నాయి. దూరదృష్టితో కూడిన పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడంతో ఎదురయ్యే వాతావరణ సవాళ్లను అవకాశాలుగా మలుచుకుంటున్నారు.ఇది స్థిరమైన అభివృద్ధికి బ్లూప్రింట్ లాంటిదని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శవంతంగా నిలుస్తుందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.
-
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
హైదరాబాద్‌లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications