Telangana: ముస్లిం ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. రంజాన్ నెల‌లో ప్ర‌త్యేక అనుమ‌తి...

తెలంగాణలోని కొత్త‌గా ఏర్ప‌డిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం ముస్లిం ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రంజాన్‌ మాసాంలో ఉద్యోగుల‌కు ప్ర‌త్యేక అనుమ‌తులు అందించ‌నుంది. ముస్లింల‌కు రంజాన్ ఎంతో ప్ర‌త్యేక‌మైన పండుగ‌. రంజాన్ మాసం మొద‌ల‌వ‌గానే ముస్లింలంతా క‌ఠిన ఉప‌వాస దీక్ష‌లు ప్రారంభిస్తారు. ఈ నెల రోజుల స‌మ‌యం వారికెంతో ప‌విత్ర‌మైన‌ది, ముఖ్య‌మైన‌ది. రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులు ప్రత్యేక ప్రార్థనలు జరుపుకోనేందుకు వీలుగా ప్ర‌భుత్వం వారికి చ‌క్క‌ని అవ‌కాశం క‌ల్పించింది.

ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న రెగ్యులర్‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సేవల ముస్లిం ఉద్యోగులకు తెలంగాణ ప్ర‌భుత్వం రంజాన్ మాసంలో ఒక గంట సమయం వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది మార్చి 12 నుంచి ఏప్రిల్‌ 11 వరకూ అమ‌ల్లోకి రానుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

Telangana Good news for Muslim employees special permission in the month of Ramzan

మ‌సీదుల ద‌గ్గ‌ర ప్ర‌త్యేక సౌక‌ర్యాలు...

ఇదిలా ఉండ‌గా, బుధవారం నాడు హజ్‌హౌజ్‌ మసీద్‌లో రంజాన్‌ ప్రత్యేక ప్రార్థనల నిర్వహణ ఏర్పాట్లను వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్‌ అజ్మతుల్లా హుస్సేనీ పరిశీలించడం జ‌రిగింది. ముస్లింల‌కు రంజాన్ మాసంలో జ‌రుపుకునే ప్ర‌త్యేక ప్రార్థనలకు, ఇఫ్తార్‌ విందుకు ఎటువంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా ప‌లు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప‌విత్ర రంజాన్ పండుగ‌కు ముందునుంచే ఏర్పాట్లు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న సచివాలయ అధికారులు, ప్రజాప్రతినిధులతో రంజాన్ ఏర్పాట్లపై స‌మీక్షా సమావేశం నిర్వహించారు. మ‌సీదుల ద‌గ్గ‌ర అన్నీ సౌక‌ర్యాలు క‌ల్పించేలా ఏర్పాట్లు చేయాల‌నున్నారు. ముఖ్యంగా మసీదుల దగ్గర షామియానాలు, నీటి వసతి, విద్యుత్ అంతరాయం లేకుండా తగు జాగ్ర‌త్త‌లు చేయాల‌ని ఆయ‌న అన్నారు.

Telangana Good news for Muslim employees special permission in the month of Ramzan

తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా ఏర్ప‌డిన కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తున్న మొదటి రంజాన్‌ను ముస్లిం ప్ర‌జ‌లు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునేలా చర్యలు చేపట్టాలని ఆయ‌న తెలిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి అధికారుల‌కు ప‌లు ర‌కాల సూచ‌న‌లు చేశారు. రంజాన్ పండుగ నిధుల విడుదలపై ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డితో చర్చిస్తానని ప్ర‌క‌టించారు. ప్ర‌తీ మ‌సీదు ద‌గ్గ‌ర వీధి దీపాలు వెలిగేలా చూడాలని మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+