ఆరోగ్య శాఖ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ ఉద్యోగులకు తీపి కబురు ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, గౌరవ వేతన పద్ధతిలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు ఒక ఏడాది వరకు సేవా విస్తరణ కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం మొత్తం 16,448 మంది ఉద్యోగులు ఈ ప్రయోజనం పొందనున్నారు.

వీరిలో..
4,772 పోస్టులు - కాంట్రాక్ట్ బేసిస్‌లో
8,615 పోస్టులు - ఔట్‌సోర్సింగ్ విధానంలో
3,056 పోస్టులు - గౌరవ వేతన పద్ధతిలో
5 పోస్టులు - MTS (మల్టీ టాస్కింగ్ స్టాఫ్) ప్రాతిపదికన ఉన్నవారు
వీరందరికి 2025 జూన్ 30 వరకు కాలం పొడిగింపు అమలులోకి వస్తుంది.
ఈ ఉద్యోగులందరూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్, పీహెచ్‌సీలు, బేసిక్ మెడికల్ కళాశాలలు, టీజీఎస్‌సీహెచ్, మల్టీ స్పెషాలిటీ సెంటర్లు వంటి ఆసుపత్రుల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆరోగ్య సేవల బలోపేతానికి వీరి సేవలు అత్యవసరమైనవని అధికారులు భావించి ఈ పొడగింపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
భారీ సంఖ్యలో ఉద్యోగుల సేవా కాలాన్ని పొడగించడం ద్వారా రాష్ట్రంలో ఆరోగ్య సేవల్లో విరామం లేకుండా కొనసాగే అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వ రంగ వైద్య వ్యవస్థలో సిబ్బంది కొరత లేకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటైన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు పాత సిబ్బంది అనుభవం మేలు చేస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications