మహిళలకు మరో అదిరిపోయే శుభవార్త చెప్పిన తెలంగాణా సర్కార్!

తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశామని, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడానికి తమవంతుగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలకు మరో శుభవార్త కూడా చెప్పారు.

శుభవార్త చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఈనెల పదవ తేదీ నుండి 16వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ప్రజల సమక్షంలో వడ్డీలేని రుణాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. నేడు ప్రజా భవన్ లో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాల సందర్భంగా ఈ విషయాన్ని స్పష్టం చేసిన ఆయన tsrtc నుంచి అద్దె బస్సులు నడుపుతున్న ఆర్టీసీ స్వయం సహాయక బృందాల మహిళలకు చెక్కులు అందజేశారు.

Telangana government has announced another great news for self help groups women

Take a Poll

మహిళలను నిజమైన మహారాణులుగా చేస్తున్న రేవంత్ సర్కార్
అనంతరం మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వారిని నిజమైన మహారాణులుగా గౌరవిస్తుందని పేర్కొన్నారు. స్వయం సహాయక బృందాలు ఆర్థికంగా లాభాలను ఆర్జించి, వారి కుటుంబాలు స్థిరపడి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశయంతోనే ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందిస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

వడ్డీలేని రుణాల పంపిణీపై మాట్లాడిన డిప్యూటీ సీఎం
గత ప్రభుత్వ హయాంలో మహిళలకు వడ్డీలేని రుణాల విషయంలో నిర్లక్ష్యం చేసిందని, కానీ తమ ప్రభుత్వ హయాంలో వడ్డీ లేని రుణాలను ప్రోత్సహించి వారిచే ప్రత్యేక వ్యాపారాలు చేయిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో లక్షలాది మందితో సభలు నిర్వహించి రెండు సార్లు వడ్డీలేని రుణాల చెక్కుల పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. మరోసారి వడ్డీ లేని రుణాల పంపిణీని నిర్వహించాలని భావించినట్టు ఆయన తెలిపారు.

తెలంగాణలో మహిళా సాధికారతలో కొత్త శకానికి నాంది
మళ్లీ త్వరలోనే వడ్డీ లేని రుణాలను మహిళలకు అందించబోతున్నట్టు భట్టి విక్రమార్క వెల్లడించారు. అంతేకాదు బ్యాంకు లింకేజీ, లోన్ బీమా, ప్రమాద బీమా వంటి సౌకర్యాలను కూడా స్వయం సహాయక బృందాలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని ప్రకటించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తే రాష్ట్రం, ప్రజలు గౌరవంగా తలెత్తుకుని జీవించే పరిస్థితి వస్తుందని అప్పుడు తెలంగాణలో మహిళా సాధికారతలో కొత్త శకానికి నాంది పలికినట్టు అవుతుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+