ప్రత్యేక ఉమెన్ క్లినిక్ లు.. తెలంగాణా సర్కార్ మహిళా దినోత్సవ కానుక!!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి ప్రత్యేక కానుక ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.రాష్ట్రవ్యాప్తంగా మహిళా క్లినిక్ లను ప్రారంభించి గిఫ్ట్ గా ఇవ్వనుంది.
మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి దేశం సిద్ధమవుతోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి ప్రత్యేక కానుక ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం మరొక అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంతో మహిళల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రాష్ట్రవ్యాప్తంగా మహిళా క్లినిక్ లను ప్రారంభించి గిఫ్ట్ గా ఇవ్వనున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.

తెలంగాణా సర్కార్ మహిళా దినోత్సవ కానుక
మొత్తం 100 కేంద్రాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కానుకగా రాష్ట్రవ్యాప్తంగా మహిళా ప్రత్యేక క్లినిక్ లను ప్రారంభించనుంది కేసీఆర్ సర్కార్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాలలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి మంగళవారం ప్రత్యేక వైద్య సదుపాయాలను అందించడానికి రెడీ అయింది. ఈ క్లినిక్ ల ద్వారా మహిళలకు బీపీ , షుగర్ తో పాటుగా క్యాన్సర్ పరీక్షలను కూడా నిర్వహించనున్నారు.

మార్చి 8న 100 కేంద్రాలలో ప్రత్యేక ఉమెన్ క్లినిక్ లు
మొత్తం మహిళలకు 57 రకాల టెస్టులను అందుబాటులో ఉంచి, వారికి వైద్య సేవలు అందిస్తూ మహిళా ఆరోగ్య పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వెయ్యనుంది. ప్రస్తుతం 100 కేంద్రాలలో ప్రత్యేక ఉమెన్ క్లినిక్ లను ప్రారంభించి ఆపై రానున్న రోజుల్లో 1200 కేంద్రాల ద్వారా సేవలు అందించాలని నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మార్చి 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 100 కేంద్రాలలో మహిళా క్లినిక్లను ఏర్పాటు చేయడానికి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది.

మహిళల కోసం పరీక్షలు, వైద్య చికిత్సలు
ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల డిఎంహెచ్వోలకు ఇప్పటికే మహిళా క్లినిక్ ల విషయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మహిళా క్లినిక్ లలో మహిళలకు పరీక్షలు నిర్వహించడమే కాకుండా మందులు కూడా ఉచితంగా అందిస్తారు. మహిళలకు థైరాయిడ్ సహా విటమిన్ పరీక్షలను కూడా చేస్తూ, ముఖ్యంగా మహిళల్లో ఉన్న పోషకాహార లోపాలని నివారించడానికి కూడా మహిళా క్లినిక్ లు సమర్ధవంతంగా పనిస్తాయని తెలుస్తుంది.

సూపర్ గిఫ్ట్ ఇవ్వబోతున్న తెలంగాణా సర్కార్
ఇక మహిళా క్లినిక్ లకు వచ్చే పేషంట్ల వివరాలన్నింటినీ ప్రత్యేక యాప్ లో రూపొందించి, వీటిని రిఫర్ చేసే ఆసుపత్రులకు లింక్ చేస్తారు. ఆయా ఆస్పత్రులలో పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారి చికిత్సలు జరిగేలా ప్రత్యేక సహాయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా మహిళల ఆరోగ్యానికి తెలంగాణా ప్రభుత్వం పెద్ద పీట వేసి ఈ ఏడాది సూపర్ గిఫ్ట్ ఇవ్వబోతుంది అన్నది తెలుస్తుంది.












Click it and Unblock the Notifications