TS 10th Exams Schedule: తెలంగాణలో పది పరీక్షల షెడ్యూల్ విడుదల- తేదీలు ఇవే..!
తెలంగాణ ప్రభుత్వం ఇవాళ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారులు పలు సార్లు భేటీలు నిర్వహించి ఈ షెడ్యూల్ ను ఖరారు చేశారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి 18న పరీక్షలు ప్రారంభం కానున్నాయి. గతంలో జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీ, అక్రమాల నేపథ్యంలో ఈసారి పరీక్షల్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.

తెలంగాణ ప్రభుత్వం ఇవాళ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి 18న పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు అంటే మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు, కాంపోజిట్ కోర్సు) పరీక్ష ఉంటుంది. మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహిస్తారు. మార్చి 21న థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లిష్) పరీక్ష ఉంటుంది. మార్చి 23న మ్యాథమేటిక్స్ (గణితం), మార్చి 26న సైన్స్ పేపర్ 1 (ఫిజిక్స్), మార్చి 28న సైన్స్ పేపర్ 2 (బయోలజీ) నిర్వహిస్తారు. మార్చి 30న సోషల్ పరీక్ష నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 1న ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 (సంస్కతం, అరబిక్), ఎస్సెస్సీ ఒకేషనల్ కోర్సు (థియరీ) పరీక్షలు ఉంటాయి. ఏప్రిల్ 2న ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 (సంస్కృతం, అరబిక్) పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతీ రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ పరీక్షలు ఉంటాయి. ఈసారి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. గతంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో మాల్ ప్రాక్టీస్, ప్రశ్నాపత్రాల నిర్వహణ విషయంలోనూ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది.












Click it and Unblock the Notifications