పార్ట్ టైమ్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త
ప్రస్తుతం తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్స్ పెరిగిపోతున్నారు. పార్ట్ టైమ్ ఉద్యోగాలు అధికం అవుతున్నాయి. స్విగ్గీ, జొమాటో, జెప్టో దగ్గర్నుంచి ర్యాపిడో,ఓలా,ఉబర్ ఇలా ప్రతి రంగంలో పార్ట్ టైమ్ ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. తక్కువ సమయం ఎక్కువ డబ్బు అన్న కాన్సెప్ట్ కారణంగా యువత ప్రభుత్వ ఉద్యోగాలు, సాఫ్ట్ వేర్ కంపెనీలకు వెళ్లకుండా పార్ట్ టైమ్ ఉద్యోగాలకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. రోజులో ఓ పూట పార్ట్ టైమ్ ఉద్యోగం చేసి.. మరో పూట వారి చదువులు, కోచింగ్స్, ఇతర ఆటలు, ఇష్టమైన పనులు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సంఖ్య పెరిగిపోతోంది. నీతి ఆయోగ్ డేటా ప్రకారం 2020లో దేశంలో 70 నుంచి 80 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉండగా.. 2029-30 నాటికి ఆ సంఖ్య 2 కోట్లు దాటనుందని ప్రముఖ సంస్థల సర్వేల ద్వారా వెల్లడవుతోంది. ఇక ప్రస్తుతం తెలంగాణలో 4.5 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నట్లు సమాచారం. అయితే గిగ్ వర్కర్ల సంక్షేమం, భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే గిగ్ వర్కర్ల కోసం ఓ బోర్డును ఏర్పాటు చేసేందుకు ఆలోచన చేస్తుందని కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి తెలిపారు.
ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ యువతకు హామీ ఇచ్చిందని.. త్వరలోనే గిగ్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వివేక్ వెంకట స్వామి గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల ముందు వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త చట్టం తెస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికే రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లోని గిగ్ వర్కర్లకు ప్రత్యేకంగా ఓ చట్టాన్ని రూపొందించారని మంత్రి వివేక్ గుర్తు చేశారు.

రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల మాదిరిగా త్వరలోనే తెలంగాణలోనూ గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురానున్నట్లు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి తెలిపారు. ఈ మేరకు పార్ట్ టైమ్ ఉద్యోగుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తొలి అడుగు వేయబోతోందని తెలిపారు. గిగ్ వర్కర్లకు సంబంధించిన కొత్త చట్టాన్ని కేబినెట్ ముందుకు తీసుకురాబోతున్నామని పేర్కొన్నారు.
గిగ్ వర్కర్ల బిల్లు రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదం పొందాక అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెడతామని మంత్రి వివేక్ స్పష్టం చేశారు. దీంతో తెలంగాణలోని 4.5 లక్షల మంది గిగ్ వర్కర్లకు లబ్ధి చేకూరుతుందని వివరించారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications