కేసీఆర్ సర్కారు నుంచి మరో గుడ్‌న్యూస్: కాంగ్రెస్‌కు షాకే!

హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన సీఎం కేసీఆర్ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తూ, విద్యార్థుల సంక్షేమానికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు విద్యార్థుల సంక్షేమం దిశగా మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.

దసరా కానుకగా, అక్టోబర్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో (1 నుంచి 10వ తరగతుల వరకు) చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు "ముఖ్యమంత్రి అల్పాహార పథకం" (Chief Minister's Breakfast Scheme) అందించాలని సీఎం నిర్ణయించారు. తద్వారా విద్యార్థులకు చక్కని బోధనతో పాటు మంచి పోషకాహారం అందించే దిశగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనుంది.

 cm breakfast scheme

తద్వారా నిరుపేద కుంటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా చర్యలు చేపట్టింది. ఉదయాన్నే వ్యవసాయం పనులు, కూలీపనులు చేసుకోవడానికి వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు పడే ఇబ్బందులను అర్థం చేసుకున్న సీఎం మానవీయ ఆలోచనకు అద్దంపట్టే దిశగా ఈ అల్పాహార పథకాన్నిరాష్ట్ర ప్రభుత్వం దసరా నుంచి అమలు చేయనుంది.

సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత ఉత్తర్వులను జారీ చేసింది. కాగా, తమిళనాడు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ఈ పథకాన్ని పరిశీలించి రావాలని ఐఎఎస్ అధికారుల బృందాన్ని సీఎం ఇటీవలే పంపించారు. అక్కడ విజయవంతంగా అమలవుతున్న "విద్యార్థులకు అల్పాహారం" పథకాన్ని అధ్యయనం చేసిన అధికారుల బృందం ప్రభుత్వానికి నివేదిక అందించింది.

తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాలల వరకే అమలు చేస్తున్నారనే విషయాన్ని సీఎం దృష్టికి బృందం తీసుకువచ్చింది. విద్యార్థుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించే సీఎం శ్రీ కేసీఆర్.. ఖర్చుకు వెనకాడకుండా ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థులకు కూడా బ్రేక్ ఫాస్టును అందచేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేటా దాదాపు రూ. 400 కోట్లు ఖర్చు చేయనుంది.

కాంగ్రెస్‌కు షాక్

కాగా, కాంగ్రెస్ పార్టీకి తాజా నిర్ణయంతో సీఎం కేసీఆర్ షాకిచ్చినట్లయింది. హైదరాబాద్ నగరంలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) సమావేశంలో ఆరు గ్యారంటీ స్కీంల ప్రకటనకు ముందే కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలోని పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ ప్రకటన చేయడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+