తెలంగాణ సర్కారుపై మరోసారి గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి అంటే ఒక్క కుటుంబం కోసం కాదని.. అందరూ అభివృద్ధి చెందాలన్నారు. జీ-20 సమావేశాల్లో భాగంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన సీ-20 సమాజ్‌శాల కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మట్లాడుతూ.. కొంతమంది మాట్లాడుతారు కానీ.. పనిచేయరు. దేశాధినేతలనైనా కలవొచ్చు కానీ. . ఈ స్టేట్ చీఫ్(సీఎం)ను మాత్రం కలవలేమన్నారు. నన్ను సచివాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదు. ప్రగతిభవన్.. రాజ్‌భవన్ దూరంగా ఉంటున్నాయి అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు.

వివిధ దేశాలు ఒక్కచోటికి రాగలవు కానీ.. రాజ్‌భవన్.. ప్రగతిభవన్ మాత్రం క్లోజ్‌గా రావన్నారు. భారీ సెక్రటేరియట్ ప్రారంభిస్తే ఫస్ట్ సిటిజన్(గవర్నర్)కి ఆహ్వానం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నరు కానీ, ముఖ్యమంత్రి కానీ స్వార్థం కోసం పనిచేయరని.. దేశం కోసం, ప్రజల కోసం మాత్రమే తాము ఉన్నామన్నారు. ప్రధాన మంత్రి మోడీ సహా అందరం అదేచేస్తున్నామన్నారు. నిస్వార్థంగా పనిచేయాలని గవర్నర్ తమిళిసై హితవు పలికారు.
కాగా, సచివాలయ ప్రారంభానికి తనకు ఆహ్వానం రాలేదని గవర్నర్ తెలిపారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా ప్రభుత్వం ఎప్పుడూ ప్రొటోకాల్ పాటించలేదని తప్పుబట్టారు. తాను తెలంగాణకు సేవ చేయడానికే వచ్చానని, రాజకీయాలు చేయడానికి కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి తనపై వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తోందని తమిళిసై విమర్శించారు.
కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ రాలేదంటూ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే, గవర్నర్‍కు అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని రాజ్‌భవన్ స్పష్టం చేసింది. ఆహ్వానమే లేనప్పుడు హాజరుకాలేదని విమర్శిచడం సరికాదని పేర్కొంది.












Click it and Unblock the Notifications