కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ గవర్నర్ తమిళిసై

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) త్వరగా కోలుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) త్వరగా కోలుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. స్వల్ప అస్వస్థతో సీఎం కేసీఆర్ ఆదివారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. విషయం తెలుసుకున్న గవర్నర్.. సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

కాగా, కేసీఆర్‌ ఆదివారం ఉదయం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కడుపులో కొంచెం నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఏఐజీ ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి.. సీఎంకు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు చేయించారు. సీటీ స్కాన్‌, ఎండోస్కోపీ పరీక్షలు కూడా నిర్వహించారు.

 Telangana governor tamilisai soundararajan tweet wishing cm kcr a speedy recovery

ఈ పరీక్షల్లో సీఎంకు కడుపులో చిన్న అల్సర్‌ ఉన్నట్లుగా తేలింది. మందులతో ఆ అల్సర్‌ తగ్గిపోతుందని వైద్యులు తెలిపారు. అల్సర్‌ మినహా మిగతా అన్ని పారామీటర్స్‌ నార్మల్‌గా ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైంది. దీంతో అల్సర్‌ తగ్గడానికి అవసరమైన మెడికేషన్‌ను ప్రారంభించారు.

కాగా, సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఏఐజీ ఆస్పత్రి చైర్మన్‌ నాగేశ్వర్‌ రెడ్డి ఒక ప్రకటన చేశారు. ప్రస్తుతం సీఎం ఆరోగ్యం సాధారణంగానే ఉందని తెలిపారు. సీఎంకు సీటీ స్కాన్‌, ఎండోస్కోపీ నిర్వహించామని, ఆయన గ్యాస్ట్రిక్‌ ప్రాబ్లంతో ఇబ్బంది పడ్డారని తెలిపారు. అల్సర్ ఉన్నట్టుగా పరీక్షల్లో తేలిందని, సంబంధిత వైద్య చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+