వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏమైనా.. కేసీఆర్ డిఫరెంట్: జనానికే కాదు.. ఇళ్లకూ క్వారంటైన్ సింబల్: కేటీఆర్ నియోజకవర్గంలో కలకలం..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రపంచదేశాలతో పాటు భారత్‌ను కూడా అల్లకల్లోలానికి గురి చేస్తోంది ప్రాణాంతక కరోనా వైరస్. మొన్నటిదాకా కాస్త అదుపులో ఉన్నట్టుగా కనిపించిన ఈ వైరస్.. కట్టుతప్పినట్టే కనిపిస్తోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ మహమ్మారి తిష్ట వేసింది. ఈ వైరస్ లక్షణాలతో బాధపడుతున్న పేషెంట్లు దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నారు. తెలంగాణలో ఇప్పటికే 20కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఈ సంఖ్య అయిదుకు చేరింది.

తాడేపల్లిలో జగన్: జూబ్లీహిల్స్‌లో చంద్రబాబు: ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదంటూ.. !తాడేపల్లిలో జగన్: జూబ్లీహిల్స్‌లో చంద్రబాబు: ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదంటూ.. !

నెగెటివ్‌గా తేలిన తరువాత చేతికి ముద్రవేసి..

నెగెటివ్‌గా తేలిన తరువాత చేతికి ముద్రవేసి..

కరోనా వైరస్‌ను నియంత్రించడంలో భాగంగా దేశవ్యాప్తంగా క్వారంటైన్ శిబిరాలు ఏర్పాటయ్యాయి. ఈ శిబిరాల్లో 14 రోజుల పాటు తలదాచుకున్న వారికి మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు వారి చేతుల మీద క్వారంటైన్ ముద్రను వేస్తున్నాయి. విదేశాల నుంచి స్వస్థలానికి చేరిన భారతీయులను తొలుత క్వారంటైన్ శిబిరాలకు తరలిస్తున్నారు. అక్కడ అన్ని రకాల వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. నెగెటివ్‌గా తేలిన తరువాతే ఇళ్లకు పంపించేస్తున్నారు.

చేతికి మాత్రమే పరిమితం కాదు..

చేతికి మాత్రమే పరిమితం కాదు..

అలా క్వారంటైన్‌ను ముగించుకున్న వారి చేతులపై మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఓ సింబల్‌ను ముద్రిస్తుండగా.. ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే తాను డిఫరెంట్ అనిపించుకుంటున్నారు కేసీఆర్. వారికంటే ఓ రెండడుగులు ముందే ఉన్నారు. క్వారంటైన్ నుంచి వచ్చిన వారి చేతులపై మాత్రమే కాకుండా.. వారి ఇళ్లకు కూడా ఈ సింబల్‌ను ముద్రిస్తున్నారు. ఆయా లోగోలను విదేశాల నుంచి వచ్చిన వారి ఇళ్లకు అతికిస్తున్నారు.

ఈ ఇంటికి ఎవరూ రాకూడదంటూ..

ఈ ఇంటికి ఎవరూ రాకూడదంటూ..

`ఈ గృహం దిగ్బంధనంలో ఉంది.. సందర్శకులకు అనుమతి లేదు.., ఈ ఇంటికి రాకూడదు ఆరోగ్య నిర్బంధములో ఉన్నది.. అనే అక్షరాలతో కూడిన వేర్వేరు క్వారంటైన్ స్టిక్కర్లను తెలంగాణ వ్యాప్తంగా అతికిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి పేరు, చిరునామా, మొత్తం సభ్యుల సంఖ్యకు సంబంధించిన వివరాలను ఈ సింబల్‌లో పొందుపరుస్తున్నారు. సదరు వ్యక్తి తన నివాసానికి చేరుకున్న తేదీ నుంచి 14 రోజుల పాటు ఈ గృహనిర్బంధం కొనసాగుతుంది.

Recommended Video

Janatha Curfew : Ambika krishna Responds On Janatha Curfew
కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విమర్శలు..

కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విమర్శలు..

కేసీఆర్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. కరోనా వైరస్‌ను నియంత్రించడానికి తాము స్వచ్ఛందంగా సహకరిస్తున్నామని, అలాంటి పరిస్థితుల్లో తాము క్వారంటైన్ శిబిరాల నుంచి వచ్చినట్లుగా లేదా ఏదో తప్పు చేసినట్టుగా తమ నివాసాలను కూడా క్వారంటైన్‌లో ఉంచడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. చేతులపై ముద్ర వేయడాన్ని తాము తప్పు పట్టట్లేదని, ఇళ్లకు కూడా వర్తింపజేయడం మంచి పద్ధతి కాదని అంటున్నారు.

English summary
Telangana too has started stamping people who return from abroad, and are supposed to be under home quarantine for two weeks. Following in the footsteps of Maharashtra and Karnataka, the Telangana government on Saturday said that it had begun stamping the date of arrival on the hands of passengers who were returning from foreign countries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X