కెసిఆర్ సర్కార్ చేసింది ఇదీ: వడ్డీకే కిందికే జమ, రైతు భారం తగ్గేదెలా?

తెలంగాణ ప్రభుత్వం నాలుగు విడతలుగా అమలు చేసిన పంట రుణమాఫీ చెల్లింపులు వడ్డీ కిందకే పోయాయి.తద్వారా రైతులు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలతో కలిపి రూ.59,513. 42 కోట్ల మేరక

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నాలుగు విడతలుగా అమలు చేసిన పంట రుణమాఫీ చెల్లింపులు వడ్డీ కిందకే పోయాయి. తద్వారా రైతులు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలతో కలిపి రూ.59,513. 42 కోట్ల మేరకు బ్యాంకుల వద్ద అప్పున పడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాల మాఫీకింద 35,56,678 మంది రైతులకు రూ.17వేల కోట్లు రుణమాపీ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అదీ కూడా రూ. 17వేల కోట్లు, నాలుగు విడతలుగా చెల్లించిన ప్రభుత్వం రైతులందరికీ రుణ విముక్తి కలిగించినట్ల ప్రచారం చేసుకుంటున్నది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ నిధుల్లో రెండు విడతలు బ్యాంకులు వడ్డీ కింద జమ చేసుకున్నాయి.

Telangana Govt completes crop loan waive, but farmers plights same

ఒక రైతుకు ప్రభుత్వం ఇచ్చిన రూ. లక్ష రూపాయల్లో రూ.44వేలను బ్యాంకులు వడ్డీగా జమ చేసుకున్నాయి. చివరకు రైతుకు దక్కింది రూ. 56వేలు మాత్రమే. బ్యాంకులు రూ. లక్ష వరకు వ్యక్తిగత పూచీకత్తుపై రుణాలివ్వాలనే నిబంధన ఉన్నా పట్టించుకోవడం లేదు. కొత్తగా రైతులకు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. 2015-16లో రూ.27800.16 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంటే లక్ష్యానికి చేరుకున్నది మాత్రం రూ.23400.32 కోట్లు మాత్రమే.

ఈ ఏడాది పంట రుణాల ఊసే లేదు...

వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 23578 కోట్ల రుణాలకు పెట్టుకొని రూ.1995.67 కోట్లు మాత్రమే ఇచ్చింది. పంట రుణాల మొత్త లక్ష్యం 37652 కోట్లయితే ఇచ్చిన రుణాలు రూ. 34,187 కోట్లే. అయితే దీర్ఘకాలిక రుణాల కింద రూ.7494.30 కోట్లు కేటాయిస్తే రూ. 8,791 కోట్ల మేరకు బ్యాంకులు రుణాలిచ్చాయి. 2016-17 ఖరీఫ్‌ సీజన్‌లో 2.90 లక్షల రైతు ఖాతాలకు 17,460 కోట్ల రుణాలివ్వాలని, రబీ సీజన్‌లో 1.93 లక్షల మందికి రూ.11,640 కోట్లు రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ ఏడాది కొత్త రుణాల ఊసే లేదు. ప్రస్తుతం పంట రుణాలే రూ.32 వేల కోట్ల అప్పులు ఉన్నాయి.

వ్యవసాయ అధికారుల వద్ద కొరవడిన ప్రణాళిక

ఇప్పుడు ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానున్నది. ఇన్ని కోట్ల రూపాయల అప్పులు బకాయి ఉన్న రైతులు తిరిగి కాడి గట్టాలంటేనే భయపడే పరిస్థితి నెలకొన్నది. ఈ నెల ఒకటో తేదీ వరకు రైతులకు రుణాలు ఇవ్వాల్సి ఉన్నా ఇంత వరకు అతీగతీ లేదు. వ్యవసాయ శాఖ వద్ద ప్రణాళికే లేదు. ఆ శాఖ అధికారులు మొద్దు నిద్రలో ఊగుతున్నారు.

పాలకులకు పట్టని కౌలు రైతుల సమస్యలు

ఇక రాష్ట్ర వ్యాప్తంగా 14లక్షల మంది కౌలురైతులు ఉన్నారని అంచనా. వాస్తవంగా 20 లక్షల మంది వరకు కౌలు రైతులుంటారని అనధికార సమాచారం. వీరికి గుర్తింపే లేదు. అంతకు మించి రుణాలిచ్చే వారు లేరు. చివరకు కౌలు రైతులెంత మంది ఉన్నారో చెప్పడానికి ఇచ్చగించక ప్రభుత్వం ఆ సంఖ్య కుదించి చెప్తున్నది. 2015-16లో కౌలు రైతులకు రూ.21 కోట్లు రుణాలిస్తే గత ఏడాది ఆ ఊసే లేదని తెలిసింది. కౌలు రైతులే కాక రాష్ట్రంలో ఐదెకరాల లోపు భూమి గల రైతులకు 15శాతం మందికే బ్యాంకు రుణాలు అందుతున్నాయి.

ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లోనే 85 శాతం రైతులు

దీంతో 85 శాతం మంది రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులనే ఆశ్రయిస్తున్న దుస్థితి నెలకొన్నది. వ్యవసాయ ఉత్పత్తులకు పెట్టుబడి కీలకమైన సంగతి అందరికీ తెలిసిందే. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం వ్యవసాయానికి 18శాతం రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అమలు చేసిన సందర్భాలు ఏనాడడూ లేవని రైతు సంఘాల నేతలు చెప్తేస్తున్నారు.

రుణాల మంజూరులో ప్రాధాన్యాలు మార్చేసిన వైనం

ఇక ఇప్పటికే ప్రభుత్వం ప్రాధాన్యత రంగాల నిర్వచనాన్నే మార్చేసింది. ఇప్పుడు మధ్యతరహా వ్యాపార సంస్థలు, సామాజిక మౌలిక వసతులను తిరిగి ఉపయోగించుకోగల ఇంధన ప్రాజెక్టులు కూడా ఈ రంగంలోకి చేర్చబడ్డాయి. ఇదీ కాక గతంలో వ్యవసాయ రంగానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అందించే రుణాలను వేర్వేరుగా చూపేవారు. ఇప్పుడు అన్ని రుణాలను కలిపి ఒకే విధంగా చూపించేందుకు వీలుకల్పించుకున్నారు. రూ. 10కోట్ల వరకు రుణాలిస్తున్నట్టు ఒక బ్యాంకు మేనేజర్‌ చెప్పారు. ఇతరత్రా చిన్న పరిశ్రమలకు రూ.5కోట్ల నుంచి రూ.15కోట్ల వరకు ఇస్తున్నామన్నారు. రైతులకు రూ. లక్ష కూడా రుణం ఇవ్వడం లేదు. నేరుగా ఇచ్చే రుణాలు తగ్గించి పరోక్షంగా ఇచ్చే రుణాలను పెంచేస్తున్నారు.

లక్ష్యాలే చేరని పంట రుణాలు

2014-15లో పంట రుణాల లక్ష్యం రూ.18718 కోట్లు. దీర్ఘకాలిక రుణాలు రూ.6278కోట్లు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.2270 కోట్లు మొత్తం రూ.27233 కోట్లు. అయితే ఖరీఫ్‌, రబీలో కలిపి రూ.18420 కోట్లు ఇచ్చినట్టు ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 982 వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సహకార సంఘాల రుణాల లక్ష్యం సుమారుగా రూ.4,500 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అదే విధంగా రాష్ట్రంలో 5345 గ్రామీణ బ్యాంకులున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 1796, అర్బన్‌ ఏరియాలో 664, సెమీ అర్బన్‌లో 1205, మెట్రోపాలిటన్‌ ప్రాంతాల్లో 1580 బ్యాంకులున్నాయి. ఈ బ్యాంకుల్లో మార్చి 2016 నాటికి రూ.357318 కోట్ల రూపాయలు డిపాజిట్‌ చేసి ఉన్నాయి. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల మేరకు రూ.63వేల కోట్లు, అంటే 18శాతం పంట రుణాలు ఇవ్వాల్సి ఉంది. కనీసం రూ.6వేల కోట్లు కూడా ఇవ్వడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+