పుష్ప గాడి దెబ్బ: టాలీవుడ్‌కు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్

Pushpa 2: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలకు బిగ్ షాక్ ఇచ్చింది. ఇకపై ఎలాంటి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది. ఏ సినిమాకైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఒక్క బెనిఫిట్/ప్రీమియర్ షోను ప్రదర్శించడానికి ఎలాంటి అనుమతులను మంజూరు చేయకూడదని తీర్మానించింది.

ఈ మేరకు ఈ విషయాన్ని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పుష్ప 2 ది రూల్ బెనిఫిట్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఓ మహిళ దుర్మరణం పాలు కావడం, ఓ బాలుడు తీవ్రంగా గాయపడిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Telangana govt decided not permit the benefits shows keeping the stampede during Pushpa 2 premier

పుష్ప 2 సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో దిల్‌సుఖ్‌‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందారు. తొమ్మిది సంవత్సరాల వయస్సున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. హీరో అల్లు అర్జున్, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌పై ఎఫ్ఐఆర్ పెట్టారు. దీనిపై సమగ్ర విచారణ సాగిస్తోన్నారు. అల్లు అర్జున్‌కు అభిమాని కావడం వల్ల తన కుమారుడి కోసమే కుటుంబంతో కలిసి సినిమాకు వచ్చినట్లుగా రేవతి భర్త ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ తొక్కిసలాట ఘటన పట్ల తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఇక ముందు బెనిఫిట్ షోలకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయించింది. బెనిఫిట్/ ప్రీమియర్ షోలు రద్దు చేసేలా, రెగ్యులర్ షోలు మాత్రమే ప్రదర్శించుకునేలా త్వరలోనే ఉత్తర్వులను జారీ చేయనుంది.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. రేవతి మృతిపట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలచివేసిందని చెప్పారు. ఇక నుంచి బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వబోమని స్పష్టం చేశారు. థియేటర్‌లో తొక్కిసలాట చోటు చేసుకుని ఓ నిండు ప్రాణం పోవడం బాధాకరమని అన్నారు.

ఈ ఘటన పట్ల హీరో గానీ, పుష్ప 2 సినిమా యూనిట్ గానీ స్పందించకపోవడాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పుపట్టారు. సినిమా కలెక్షన్ల కోసం ఓ నిండు ప్రాణాన్ని తిస్తారా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వందలు, వేల కోట్ల రూపాయల మేర కలెక్షన్లు వస్తాయని నిర్మాణ సంస్థ చెబుతోందని, మృతురాలి కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని ఇవ్వాలని అన్నారు.

ఆమె కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ఆ సినిమా చిత్ర నిర్మాణ సంస్థ, యూనిట్‌పై ఉందని కోమటిరెడ్డి చెప్పారు. ఆ సినిమా హీరో, నిర్మాతలకు తాను ఒకటే చెబుతున్నానని, మృతురాలి కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+