HCU: ఏఐ ఫొటోల షేరింగ్‌పై యాక్షన్- తెలంగాణ ప్రభుత్వం పిటీషన్
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో చెట్ల నరికివేత వ్యవహారం మరో మలుపు తిరిగింది. చెట్ల నరికివేత, జంగిల్ క్లియరెన్స్ అంశంపై ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ ఫొటోలను షేర్ చేసిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల అటవీ భూమిలో కొద్దిరోజుల కిందట ప్రభుత్వం చేపట్టిన చెట్ల నరికివేత వ్యవహారం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నరికివేత వల్ల అక్కడ తలదాచుకుంటోన్న వణ్యప్రాణులు, పక్షులు ఆశ్రయాన్ని కోల్పోయాయంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

హెచ్‌సీయూ విద్యార్థులు కొన్ని రోజులుగా నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. తరగతులను బహిష్కరించారు. చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారు. కొన్ని రోజుల పాటు వారి ఆందోళన కొనసాగింది. అదే సమయంలో జింకలు, దుప్పులు, నెమళ్లు ఆశ్రయం కోల్పోయి.. జనావాసాల్లోకి వస్తోన్నాయంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యాయ.
దీన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, కంచ గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల స్థలంలో ఐటీ, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ చర్యకు ఆటంకం కలిగిస్తోన్నట్లు అభిప్రాయపడ్డారు.
దీనిపై వస్తోన్న తప్పుడు కథనాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేయాలంటూ రేవంత్ రెడ్డి- అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దీనితో ప్రభుత్వం చట్టపరంగా చర్యలకు సిద్ధపడింది. చెట్ల నరికివేత, వణ్యప్రాణులు ఆశ్రయం కోల్పోయాయంటూ ఏఐ జనరేటెడ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.
అంతకుముందు- చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా దాఖలైన వివిధ పిటీషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో కూడా విచారణలో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటివరకు చెట్ల నరికివేతకు బ్రేక్ పడింది.
హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ రేణుక యారా డివిజన్ బెంచ్ సమక్షానికి ఈ పిటీషన్లు విచారణకు వచ్చాయి. ఈ ప్రాంతంలో 400 ఎకరాల అటవీ భూమిలో చెట్ల నరికివేతను వ్యతిరేకిస్తూ వాట ఫౌండేషన్, రిటైర్డ్ సైంటిస్ట్ కలపల బాబురావు దాఖలు చేసిన మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం, విద్యార్థి సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లు అవి.
వాట ఫౌండేషన్ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి తన వాదనలను వినిపించారు. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో కూడా విచారణలో ఉందని గుర్తు చేశారు. దీనిపై మరింత విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిందని అన్నారు. సుప్రీంకోర్టు ఇప్పుడు నేరుగా ఈ విషయాన్ని విచారిస్తోన్నందున- మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయని గుర్తు చేశారు.
దీనికి న్యాయమూర్తులు బదులిస్తూ- పిటీషన్‌దారులందరూ అంగీకరిస్తే విచారణను వాయిదా వేస్తామని అన్నారు. సెలవుల తరువాత విచారణ చేపడతామని అన్నారు. అటవీ మంత్రిత్వ శాఖ తరపున సీనియర్ అడ్వొకేట్ మేనకా గురుస్వామి తన వాదనలు వినిపించారు. ఈ కేసుపై తప్పుడు వార్తలు వస్తోన్నాయని ఆందోళన వ్యక్తం చేయగా..లిఖితపూరకంగా కౌంటర్ దాఖలు చేయాలని బెంచ్ ఆదేశించింది.
కాగా కంచ గచ్చిబౌలిలో చెట్ల నరికివేత అంశంపై సుప్రీంకోర్టు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి కీలక ఆదేశాలను జారీ చేసింది. 400 ఎకరాల అటవీ ప్రాంతంలో చెట్ల నరికివేత అంశం సుప్రీంకోర్టు సమక్షానికి వచ్చింది. దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. మధ్యంతర నివేదికను అందజేయాలంటూ సూచించింది.
తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) 400 ఎకరాల అటవీ ప్రాంతాన్ని సందర్శించాలని నివేదికను అందజేయాలని పేర్కొంది. అలాగే తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో చెట్ల నరికివేతకు అనుమతి లేదంటూ తెలంగాణ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications