Hyderabad: 12 వేల డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఎంపికైన లబ్ధిదారులకు సెప్టెంబర్ 2న ఇళ్లను కేటాయించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ కోసం ఆన్‌లైన్ డ్రా ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులతో మంత్రి వర్చువల్‌గా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చాలి, ఆత్మగౌరవంతో గొప్పగా జీవించాలనే సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు వంటి అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఎన్ఐసీ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన ర్యాండో మైజేషన్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఆన్‌లైన్ డ్రా నిర్వహించినట్లు వివరించారు. మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 500 మంది చొప్పున 12 వేల మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. సెప్టెంబర్ 2న లబ్ధిదారులకు జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీ వద్ద పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.
ఎవరెవరికి ఎక్కడ ఇళ్లు కేటాయించారనేది అధికారులు తెలియజేస్తారు మంత్రి తలసాని. ఈ సందర్భంగా మంత్రి తలసాని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. బహదూర్‌పురా, ఆసిఫ్‌నగర్, సైదాబాద్, యూసుఫ్‌గూడ, బేగంబజార్, బోరబండ, చాంద్రాయణగుట్ట, తదితర ప్రాంతాలకు చెందిన పలువురు లబ్ధిదారులు ఆనందం వ్యకత్ం చేస్తూ కేసీఆర్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications