గ్రామ పంచాయతీలలో చెక్ పవర్‌ పంచాయితీలకు చెక్ పెట్టే సంచలన నిర్ణయం!

తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో చెక్కులపై సంతకాలు ఆలస్యం కావడం ఒక పెద్ద సమస్యగా మారుతోంది. సర్పంచ్, ఉపసర్పంచ్‌ల మధ్య ఉండే విభేదాల కారణంగా అభివృద్ధి పనుల బిల్లులు చాలా రోజులు పెండింగ్‌లో పడుతున్నాయి. దీనికి చెక్ పెట్టటం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెక్ పవర్ విషయంలో కొత్త ఆదేశాలు జారీ చేసింది.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఈ విషయంలో గ్రామాభివృద్ధికి ఆటంకం కలగకుండా స్పష్టమైన సూచనలు ఇచ్చారు. గ్రామ పంచాయతీల్లో చెక్కులపై ఉపసర్పంచ్ సంతకం చేయాల్సి వచ్చినప్పుడు కారణం లేకుండా జాప్యం చేయకూడదని ఆదేశించారు. ఏడు రోజులకు మించి సంతకం చేయకుండా ఉంటే సంబంధిత జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు.

బీజేపీ ఆపరేషన్ తెలంగాణ - రంగంలోకి అమిత్ షా..!!
బీజేపీ ఆపరేషన్ తెలంగాణ - రంగంలోకి అమిత్ షా..!!
Telangana Govt Issues Key Orders on Gram Panchayat Cheque Power Action Against Upa Sarpanch for Delay Beyond 7 Days

విచారణలో ఉపసర్పంచ్ ఉద్దేశపూర్వకంగా చెల్లింపులను అడ్డుకున్నట్లు తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అవసరమైతే ఉపసర్పంచ్‌కు ఉన్న జాయింట్ చెక్ పవర్‌ను తొలగించి, ఆ స్థానంలో పంచాయతీ కార్యదర్శి, ఎంపీఓ లేదా ఎంపీడీవోలో ఎవరికైనా జాయింట్ చెక్ పవర్ ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు.

ఈ నిర్ణయం వల్ల రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి అభివృద్ధి పనుల బిల్లులు సకాలంలో చెల్లించే అవకాశం పెరుగుతుంది. వ్యక్తిగత విభేదాల కారణంగా పంచాయతీ నిధులు నిలిచిపోకుండా చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా పంచాయతీ అధికారులకు కూడా ఈ మార్గదర్శకాలను అనుసరించాలని సూచనలు ఇచ్చారు.తాజా ఆదేశాల ప్రకారం ఉపసర్పంచ్‌కు అభ్యంతరాలు తెలియజేసే అవకాశం ఉంటుంది. కానీ కారణం లేకుండా సంతకాలు నిలిపివేసి పనులను స్తంభింపజేయకూడదని స్పష్టంచేశారు.

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులు వీళ్లే.. !!
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులు వీళ్లే.. !!

ఏడు రోజులకు మించి చెక్కులు పెండింగ్‌లో ఉంటే కలెక్టర్ విచారణ చేసి, అవసరమైతే ప్రత్యామ్నాయ అధికారికి అధికారం అప్పగించాల్సి ఉంటుంది. ఈ చర్యల వల్ల గ్రామ పంచాయతీల్లో బిల్లుల చెల్లింపులు వేగవంతం కావడంతో పాటు చెక్ పవర్ వివాదాలు కూడా తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఊతమిస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+