తెలంగాణలో మరో సారి జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - ఇక కొత్తగా..!!
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయానికి సిద్దమైంది. గ్రేటర్ హైదరాబాద్ లో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం జిల్లాల పైన ఫోకస్ చేసింది. కేసీఆర్ హయాంలో జిల్లాల సంఖ్య పెంచతూ నిర్ణయం చేసారు. ప్రస్తుతం ఉన్న 33 జిల్లాల తెలంగాణపై ప్రభుత్వం సమీక్షిస్తోంది. జిల్లాల ఏర్పాటు పైన వచ్చిన ఫిర్యాదులు... పాలా సౌలభ్యం పరిశీలించి జిల్లాల పై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల తరువాత ఈ మేరకు కసరత్తు చేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో జిల్లాల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. జిల్లాల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు ప్రస్తుత జిల్లాల పునర్విభజన తీరు...స్థానిక పరిస్థితులు.. పాలనా సౌలభ్యం వంటి అంశాల ను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం కొత్త జిల్లాల పైన కసరత్తు చేయాలని భావిస్తోంది. కొత్తగా 5జిల్లాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలు గా కేసీఆర్ మార్చే క్రమంలో కొన్ని అభ్యంతరాలు... అదే సమయంలో భారీ స్థాయిలో వినతులు వచ్చాయి. అందులో కొంత వరకే పరిష్కారం అయ్యాయి. అయితే, జిల్లాల పుర్విభజన మరోసారి చేయటం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. అదిలాబాద్ తో సహా తమ ప్రాంతాలను అశాస్త్రీ యంగా విభజించారని మహబూబ్ నగర్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.













Click it and Unblock the Notifications