నాలుగు వేల పెన్షన్ అమలు ముహూర్తం ఖరారు..!!
తెలంగాణలో రేవంత్ సర్కార్ కొలువు తీరి ఏడాది పూర్తవుతోంది. ఈ సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అధికారంలోకి రావటానికి దోహదం చేసిన గ్యారంటీల అమల్లో భాగం గా రేవంత్ సర్కార్ ఇప్పటికే కొన్ని ప్రారంభించింది. ఇక, రూ 4వేల పెన్షన్ అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే లబ్దిదారుల సంఖ్య, ఖర్చు అంచనా పైన ఒక స్పష్టతకు వచ్చింది. దీంతో, త్వరలోనే ఈ పథకం అమలు పైన ప్రకటనకు సిద్దమవుతోంది.
ప్రభుత్వం కసరత్తు
ముఖ్యమంత్రి రేవంత్ తొలి ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు దిశగా కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్ల పథకాలు అమలు చేస్తున్నారు. రైతు రుణమాఫీ దాదాపుగా పూర్తి చేసారు. ఇంకా రుణమాఫీ చేయాల్సిన వారికి త్వరలోనే పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇదే సమయంలో ఎన్నికల సమయంలో పెన్షన్ రూ 4వేల కు పెంచి అమలు చేస్తామని నాడు కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. ఈ హామీ అమలు దిశగా ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. త్వరలో పంచాయితీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.

పెన్షన్లు పెంపు
ఈ ఎన్నికలకు ముందే పెండింగ్ హామీలను అమలు చేయాలని ఆలోచన చేస్తోంది. ఏడాది పాలన పూర్తవుతున్న వేళ ఆసరా పెన్షన్ రూ 4 వేలకు పెంపుతో పాటుగా రైతు భరోసా పైన ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. రైతు భరోసా గురించి ప్రతిపక్షాల నుంచి విమర్శలు మొదల య్యాయి. ఆసరా పెన్షన్ పెంపు, రైతు భరోసా అమలు కాకపోవటం పైన ప్రజల్లో కొంత అసంతృప్తి ఉన్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. దీంతో, ఈ రెండు అమలు చేయటం ద్వారా పూర్తి సానుకూలత వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం నిర్వహిస్తున్న సర్వేలోనూ పలువురు వీటి కోసం ప్రశ్నిస్తున్నట్లు గుర్తించారు. ఈ రెండు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే నష్టం తప్పదని భావిస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో
దీంతో, ప్రస్తుతం రూ. 2 వేలు ఉన్న పెన్షన్‌ను రూ. 4వేలకు, దివ్యాంగులకు రూ. 4 వేలుగా ఉన్న పెన్షన్‌ను రూ. 6 వేలకు పెంచేలా ఆర్దిక శాఖ ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. వచ్చే నెల 9వ తేదీ నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రైతు భరోసా పైన అసెంబ్లీలో చర్చించిన తరువాతనే అమలు పైన ప్రకటన చేయాలని ప్రభుత్వం భావిస్తుంద ని సమాచారం. రైతు భరోసా పరిమితి ఖరారు పైన ఒక నిర్ణయం తీసుకున్న తరువాత అమలు గురించి ప్రభుత్వం ప్రకటన చేయనుంది. సభలో ప్రతిపక్షాల నుంచి సూచనలు, సలహాలు స్వీక రించాలనేది రేవంత్ ఆలోచనగా సమాచారం. దీంతో, వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశం పైన చర్చించిన తరువాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications