తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును పెంచే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎలక్ట్రిక్ వాహనాలపై(EV) 20 శాతం వరకు ప్రత్యేక రాయితీని అందిస్తోంది. తెలంగాణను గ్రీన్ మొబిలిటీ రంగంలో దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ మహా నగరంలో వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంలో పని చేస్తున్న ఉద్యోగులకు ఈవీ వాహనాలపై 20 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం త్వరలో హైదరాబాద్ లో 915 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నట్లు స్పష్టం అవుతోంది.
Great News for Telangana Govt Employees!
— Ponnam Prabhakar (@Ponnam_INC) March 24, 2026
Up to 20% Discount on EV purchases.
Massive Savings of UP TO 4 LAKHS per Household.
Around 5 lakh Employees will Benefit.#GreenTelangana#EVRevolution pic.twitter.com/ekcIxIWcMh
తెలంగాణ ప్రభుత్వం ఈవీ వాహనాలను ప్రోత్సహించడంలో మరో కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, శాఖలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక ప్రభుత్వ ఉద్యోగులు ఈవీ వాహనాలను కొనుగోలు చేస్తే 10-20 శాతం తగ్గింపు ఉంటుందని ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపిన విషయం తెలిసిందే. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో ఈవీ వాహనాలకు సబ్సిడీ ఇస్తున్నామని వివరించారు.
తెలంగాణను కాలుష్య రహిత రాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈమేరకు ఈవీ ఆటోలతో పాటుగా ఈవీ బస్సులను సైతం తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఇక తెలంగాణ ఈవీ పాలసీలోని కీలక విషయాలు చూస్తే.. జీరో రోడ్ టాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ టాక్స్ మినహాయింపు.. ఇది డిసెంబర్ 2026 వరకు ఇది అమల్లో ఉంటుంది.

అలాగే ఈవీ వాహనాల వినియోగం భారీగా పెరిగింది. గత ఏడాదిలో లక్షకు పైగా ఈవీలు అమ్ముడయ్యాయి. అంతేకాక ఈవీలు మొత్తం వాహనాల్లో 0.4 శాతం నుంచి 2 శాతానికి పెరిగాయి. ఇక ప్రభుత్వం సుమారు రూ. 900 కోట్ల ఆదాయ నష్టాన్ని భరించి కూడా ఈవీలను ప్రోత్సహిస్తుండటం విశేషం.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications