హైదరాబాద్ మెట్రో పై ప్రభుత్వం సంచలన నిర్ణయం, ఇక నుంచి..!!
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో నిర్వహణ పైన తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ మేరకు నిర్ణయానికి ఆమోద ముద్ర పడింది. దాదాపు రూ.13,615 కోట్ల అప్పు ఇవ్వడానికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) అంగీకరించింది. ఇందుకు సంబంధించిన ఒప్పందానికి, డాక్యుమెంట్‌కు కూడా తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ నెల 30 నాటికి మెట్రో రైలు ప్రభుత్వం తీసుకోవడానికి రూట్ క్లియరైంది.
హైదరాబాద్ మెట్రో రైలు తొలి దశ స్వాధీనం దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వ పరం చేసేందుకు అవసరమైన ఆర్థిక, చట్టపరమైన ప్రక్రియలు వేగంగా పూర్తవుతున్నాయి. దాదాపు రూ.13,615 కోట్ల రుణానికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) అంగీకరించడంతో టేకోవర్ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీనికి సంబంధించి తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలో చర్చించి.. ఆమోద ముద్ర వేసారు. ఈ రుణం మరియు సంబంధిత ఒప్పంద పత్రాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఈ నెల 30 నాటికి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను ఎల్&టి మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ నిర్వహిస్తుండగా.. ఇక ఈ నెల చివరి నుంచి ప్రభుత్వం ఈ మొత్తాన్ని టేకోవర్ చేయనుంది.

ప్రభుత్వం తాజా నిర్ణయంతో
హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) పద్ధతిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకునే ప్రక్రియలో కీలక ఒప్పందాలు ఖరారయ్యాయి. షేర్ పర్చేజ్ అగ్రిమెంట్, ప్రభుత్వ గ్యారంటీ, అండర్‌టేకింగ్ లేఖ వంటి అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం IRFC నుంచి తీసుకున్న రుణాన్ని 20 సంవత్సరాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుణానికి తెలంగాణ ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వనుంది. మొత్తం టేకోవర్ వ్యయం సుమారు రూ.15 వేల కోట్లుగా అంచనా వేసారు. ఇందులో రూ.13 వేల కోట్ల రుణం, రూ.2 వేల కోట్ల ఈక్విటీ భాగస్వామ్యం ఉన్నాయి. మెట్రో స్వాధీనం తర్వాత సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించేందుకు ఎల్&టి ఉద్యోగులను తాత్కాలికంగా కొనసాగించాలని నిర్ణయించారు. అలాగే నిర్వహణకు అవసరమైన సలహాల కోసం నిపుణుల సేవలను కూడా వినియోగించాలని డిసైడ్ అయ్యారు.












Click it and Unblock the Notifications