పెన్షన్ 4 వేలు, రూ 500కే గ్యాస్ సిలిండర్ - అమలు ముహూర్తం ఖరారు..!!
తెలంగాణ ప్రభుత్వం గ్యారంటీల అమలుపై వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా మరో రెండు పథకాల అమలుకు ముహూర్తం నిర్ణయించింది. ఇప్పటికే రెండు పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం..తాజాగా మరో రెండు ప్రారంభం పైన నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28వ తేదీ ఇందుకు ముహూర్తంగా ఖరారు చేసింది. కొత్త సంవత్సరం కానుకగా ఇవి అమల్లోకిరానున్నాయి.
హామీల అమలు దిశగా
తెలంగాణలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సోనియా గాంధీ జన్మదినం నాడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..రూ 10 లక్షలకు ఆరోగ్య శ్రీ పెంపు అమల్లోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28 నుంచి మరో రెండు పథకాలను ప్రజలకు అందజేయనుంది.

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించిన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలోనూ ఆరు గ్యారెంటీలపై చర్చ జరిగింది. పార్టీ వ్యవస్థాపక దినమైన డిసెంబరు 28 నుంచి పింఛను పెంపు, రూ.500కే గ్యాస్ సిలిండర్ అమలు ప్రక్రియను ప్రారంభించాలని ఇందులో నిర్ణయించారు. భారీ కసరత్తు అవసరం లేకుండా, తక్షణమే ప్రారంభించగలిగే పథకాలు ఏమున్నాయనే అంశంపై గాంధీ భవన్‌లో జరిగిన కాంగ్రెస్ పీఏసీలో చర్చించారు.
పెన్షన్ - గ్యాస్ సబ్సిడీ
ఈ క్రమంలోనే 'చేయూత'లో భాగంగా నెలవారీ పింఛనును రూ.4 వేలకు పెంచి ఇవ్వాలన్నదానిపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా పింఛను తీసుకుంటున్న లబ్ధిదారుల లెక్కలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్రతి నెల 45 లక్షల పైగా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ జరుగుతోంది. వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, హెచ్‌ఐవీ, బోదకాలు బాధితులకు ప్రస్తుతం ఆసరా పింఛను కింద నెలకు రూ.2,016 చొప్పున ఇస్తున్నారు. ఇకపై ఇది రూ.4 వేలు కానుంది.
ఇప్పటివరకు నెలకు రూ.900 కోట్ల వరకు ఖర్చవుతుండగా.. పెరిగే పింఛను మొత్తంతో ఇది రెట్టింపయ్యే అవకాశం ఉంది. నెలకు రూ.1,800 కోట్లు చొప్పున ఏటా రూ.21,600 కోట్లకు చేరనుంది. కాగా, వికలాంగులకు రూ.3,016 పింఛను ఇస్తున్నారు. దీనిని పెంచే విషయమై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఈ నెల 28 నుంచి అమలు
ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే ఇస్తామని ఆరు హామీల్లో పేర్కొంది. సిలిండర్ ధర రూ.955 ఉండగా.. ప్రభుత్వం రూ.455 సబ్సిడీ భరించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 1.20 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లున్నాయి. ఇందులో దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) 89.99 లక్షల మంది ఉన్నారు.
వీరికి ఏడాదికి 6 సిలిండర్లకు రాయితీ ఇస్తే ప్రభుత్వంపై రూ.2,225 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. 12 సిలిండర్లు ఇస్తే అది రూ.4,450 కోట్లవుతుంది. కాగా, కేంద్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌పై రూ.40 సబ్సిడీ ఇస్తోంది. మొత్తం డబ్బు చెల్లించి తీసుకున్న తర్వాత ఆ రాయితీని బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. ఈ రెండు పథకాల అమలు పైన ప్రభుత్వం అధికారికంగా విధి విధానాల పై ప్రకటన చేయనుంది.
-
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
మంగళూరు చేరిన భారీ ఎల్పీజీ షిప్- గ్యాస్ కష్టాలకు చెక్ -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు ముహుర్తం ఫిక్స్-కార్యకర్తలకు లేఖ-ఏ పార్టీలోకి ? -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్!












Click it and Unblock the Notifications