కేసీఆర్ కాళ్ళు మొక్కిన తెలంగాణా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.. వీడియో వైరల్, ఆడేసుకుంటున్న నెటిజన్లు!!

తెలంగాణ సీఎం కేసీఆర్ పై, తెలంగాణ అధికార యంత్రాంగం స్వామి భక్తిని ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక మంది కలెక్టర్లు, కీలక పదవుల్లో ఉన్నటువంటి వారు సీఎం కెసిఆర్ కాళ్లు మొక్కి అనేకమార్లు తీవ్ర విమర్శలకు కారణమయ్యారు. ఇక తాజాగా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కేసీఆర్ కాళ్ళు మొక్కిన ఘటన ఆసక్తిగా మారింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న చాలామంది ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్ళు మొక్కడం తెలంగాణ సమాజంలో చర్చనీయాంశంగా మారింది.

కేసీఆర్ కాళ్ళు మొక్కిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

కేసీఆర్ కాళ్ళు మొక్కిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు


తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కెసిఆర్ కాళ్ళు పదే పదే మొక్కుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వైద్య కళాశాలలలో నిన్న ఎంబిబిఎస్ తరగతులను ఏకకాలంలో వర్చువల్ విధానంలో ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు పాల్గొన్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు కెసిఆర్ పట్ల తన విధేయతను ప్రదర్శించారు. సీఎం కేసీఆర్ కు పుష్పగుచ్చం అందించి, ఒక లెటర్ కూడా ఇచ్చిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఆపై ఆయన కాళ్ళు మొక్కి తన స్వామి భక్తి ప్రదర్శించారు.

సోషల్ మీడియాలో హెల్త్ డైరెక్టర్ పై విమర్శలు

సోషల్ మీడియాలో హెల్త్ డైరెక్టర్ పై విమర్శలు

దీంతో సోషల్ మీడియాలో శ్రీనివాస రావు చేసిన పని పైన తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో అధికారుల పాద పూజలు పెరిగిపోతున్నాయని చాలా మంది టార్గెట్ చేస్తున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బానిసత్వానికి కేరాఫ్ గా మారిందని పలువురు ఈ వీడియో పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంకొందరు పదవీకాలం పొడిగించడం కోసం కెసిఆర్ కాళ్లు మొక్కి స్వామి భక్తి ప్రదర్శిస్తున్నట్లు ఉన్నారు అని వ్యాఖ్యలు చేస్తే, మరి కొందరు కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ కావాలంటా అంటూ రకరకాలుగా విమర్శిస్తున్నారు. ఆశ ,స్వార్థం మనుషులను ఎంతకైనా దిగజారుస్తుంది అని మండిపడుతున్నారు.

గతంలోనూ కేసీఆర్ కాళ్ళు మొక్కిన కలెక్టర్లు, మంత్రులు .. తాజాగా కొత్త వివాదం

ఇక గతంలోనూ తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట, కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనాలను ప్రారంభించిన సమయంలో ఆయా జిల్లాల కలెక్టర్లు వెంకట్రామారెడ్డి, శరత్ సీఎం కేసీఆర్ కు పాదాభివందనం చేశారు. అప్పుడు కూడా కెసిఆర్ కాళ్ళు మొక్కిన కలెక్టర్ల తీరుపై తెలంగాణ సమాజంలో ఆసక్తికర చర్చ జరిగింది. ఇక అంతకు ముందు మంత్రి సత్యవతి రాథోడ్ కూడా కేసీఆర్ కు వంగి వంగి కాళ్ళు మొక్కారు. అప్పుడు కూడా మంత్రి తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కూడా కేసీఆర్ కాళ్ళు మొక్కడం తీవ్ర విమర్శలకు కారణం గా మారింది. కీలక పదవుల్లో ఉన్న అధికారులు కెసిఆర్ కాళ్లు మొక్కి సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని విమర్శిస్తున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+