శిశు గృహాల్లో 18 మంది పిల్లల మృతి: హైకోర్టుకు చెప్పిన తెలంగాణ
హైదరాబాద్: శిశు గృహాల్లో 2017 జనవరి నుంచి 2018 జనవరి వరకు 18 పిల్లలు మరణించినట్లు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింంది. రాష్ట్రంలోని శిశు గృహాల్లో సంభవిస్తున్న మరణాలకు, అమ్మకాలకు బాధ్యులైన అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్రం గానీ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ బాలల హక్కుల సంఘం అధ్యక్ుడు పి. అచ్యుతరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఆ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ జస్టిస్ విజయలక్ష్మిలతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. బాలల హక్కుల సంఘం ఆరోపిస్తున్నట్లు శిశు గృహాల్లో 40 మంది పిల్లలు మరణించలేదని, 18 మంది మాత్రమే మరణించారని ప్రభుత్వ తరఫు న్యాయవాది ఎెస్ శరత్ కుమార్ చెప్పారు.

శిశు గృహాలకు మార్కెట్లలోనో, చెత్తకుప్పల దగ్గరో వదిలేసిన పిల్లలను చేర్చారని, శిశుగృహాలకు చెందినవారు తీసుకుని వచ్చేసరికి వారి ఆరోగ్యం విషమించిందని, దానివల్ల వారు మరణించారని ఆయన చెప్పారు. వారిని రక్షించడానికి వైద్యులు శాయశక్తులా ప్రయత్నించారని చెప్పారు.
వారు పోషకాహార లోపంతో మరణించారనే ఆరోపణల్లో నిజం లేదని, 18 మంది పిల్లల మరణాలపై న్యాయవిచారణ జరిపించినా తమకేమీ అభ్యంతరం లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications