Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

5 లక్షలకే ఎకరం: దర్శకుడు శంకర్‌కు భూమి కేటాయింపుపై హైకోర్టు తుది తీర్పు

హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినీ దర్శక, నిర్మాత ఎన్ శంకర్‌కు ప్రభుత్వ భూమి కేటాయింపులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. శంకర్‌కు భూమి కేటాయింపుల ప్రక్రియను ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. శంకర్‌కు భూమి కేటాయింపును వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ధర్మాసనం కొట్టివేసింది.

సినీ, స్టూడియో నిర్మాణం కోసం శంకర్‌కు రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలోని మోకిల వద్ద 2019లో ప్రభుత్వం ఐదు ఎకరాలను కేటాయించింది. మార్కెట్‌ ధర కన్నా అతి తక్కువగా కేవలం రూ.5 లక్షలకు ఎకరం చొప్పున భూమి కేటాయించడం రాజ్యాంగ విరుద్దమంటూ జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన శంకర్ 2020లో పిల్ వేశారు. సుదీర్ఘ విచారణ తర్వాత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీ ధర్మాసనం శుక్రవారం తీర్పు వెల్లడించింది.

telangana High Court judgement on director shankar land issue

భూకేటాయింపులపై ప్రభుత్వానికి కచ్చితమైన విధానం ఉండాల్సిందని.. అయితే లేనంత మాత్రాన ఈ కేటాయింపును తప్పుపట్టలేమని హైకోర్టు తెలిపింది. భూమిని ఉచితంగా తీసుకోలేదని.. రూ.25 లక్షలు చెల్లించడంతో పాటు.. భూమి డెవలప్‌మెంట్‌ కోసం రూ.కోటి 25 లక్షలు ఖర్చు చేశానన్న శంకర్ వాదనను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఇలాంటి కేటాయింపుల్లో వేలం, టెండరు ప్రక్రియ అవసరం లేదని అభిప్రాయపడింది ఉన్నత న్యాయస్థానం.

కాగా, సినీ దర్శకుడు ఎన్. శంకర్​ భూకేటాయింపును సవాల్ చేస్తూ నమోదు అయిన పిల్‌​పై హైకోర్టు విచారణ చేసింది. ఈ విచారణలో ప్రభుత్వ విధానానికి అనుగుణంగానే భూమి కేటాయించారని.. రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఫిల్మ్ స్టూడియోలు, సినీ ప్రముఖులకు తక్కువ ఖర్చుతో భూములు కేటాయించడం కొత్తేమీ కాదని కోర్టుకు తెలిపింది.

దరఖాస్తుదారుడి వాస్తవికత, హైదరాబాద్​ సమీపంలో ఫిల్మ్​ స్టూడియో ఏర్పాటు ప్రాముఖ్యత, రాష్ట్ర సినిమా రంగ అభివృద్ధిని పరిశీలించాకే.. భూమి కేటాయింపుపై నిర్ణయం తీసుకుందని కోర్టుకు వివరించింది. ఆ ప్రదేశంలో పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించి.. ఆధునిక స్టూడియో నిర్మించేందుకు రూ.50 కోట్లు పెట్టుబడిని తీసుకువస్తానని శంకర్​ హామీ ఇచ్చారని.. రూ.5 కోట్లు డిపాజిట్​ చేసిన తరవాతే భూమిని కేటాయించినట్లు మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ అరవింద్ కుమార్ కౌంటర్ అఫిడవిట్ ద్వారా కోర్టుకు తెలిపారు. ఈ స్టూడియోలో రోజూ 1000 మంది సినీ కార్మికులకు ఉపాధి కల్పిస్తారని.. 100 మందికి ప్రత్యక్షంగా, 200 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని డైరెక్టర్ ప్రభుత్వానికి హామీ ఇచ్చారని కోర్టుకు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+