విద్యార్ధులు అలర్ట్ : ఎంసెట్, ఫార్మా, అగ్రికల్చర్ ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.
తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ని ప్రకటించింది. ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే వివిధ రకాల పరీక్షల తేదీలను వెల్లడించింది. మే 4 నుంచి జూన్ 3 వరుసగా ఎగ్జామ్స్ ఉంటాయని స్పష్టం చేసింది. ఆయా పరీక్షల తేదీల జాబితాను విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మా , అగ్రికల్చర్ సహా పలు కోర్సులకు సంబంధించిన ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌ని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. సోమవారం నాడు ఆయా పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ ని ప్రకటించింది. జేఎన్టీయూ ఆధ్వర్యంలో మే 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు టీజీ ఈఏపీసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలుంటాయి. మే 9వ తేదీ నుంచి 11 వరకు ఎంసెట్ నిర్వహించనున్నారు.
బీఈడీలో ప్రవేశాల కోసం మే 12 వ తేదీన ఎడ్‌సెట్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 13, 14 తేదీల్లో పరీక్షలుంటాయి. ఎప్‌సెట్ తర్వాత అత్యధిక మంది రాసే ఐసెట్‌ను 2 రోజుల పాటు నిర్వహించనున్నారు. బీఈ, బీటెక్, బీ ఫార్మా కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా వచ్చే వారి కోసం టీజీఈసెట్ మే 15న నిర్ణయించారు. మే 18న టీజీ లాసెట్ నిర్వహణ కోసం షెడ్యూల్ ప్రకటించారు.

మే 28 నుంచి 31 వరకు పీజీఎల్ సెట్ పరీక్షలు ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మా, ఎంఆర్క్, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎగ్జామ్స్ ఉంటాయి. పీజీ ఈసెట్, మే 31 నుంచి జూన్ 3వ తేదీ వరకు పీఈసెట్ పరీక్షలను నిర్వహించనున్నట్టు స్ఫష్టం చేసింది. ఈసారి దరఖాస్తు ఫీజుల్లో ఎటువంటి మార్పు లేదు.
అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు
ఉదయం వేళల్లోనే ఎక్కువ మంది అమ్మాయిలు పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దూర ప్రాంతాల్లో కాకుండా వారికి సమీప నగరంలోని పరీక్షా కేంద్రాలను కేటాయించడంపైనా దృష్టి సారించారు. మధ్యాహ్నం షిఫ్ట్ పరీక్షలు సాయంత్రం 6 గంటలకు పూర్తవుతాయి. టెక్నికల్ ప్రాబ్లమ్ వలన కంప్యూటర్లు పనిచేయకపోతే పరీక్ష ఆలస్యమవుతుంది. చీకటి పడిన తర్వాత ఆడపిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని అమ్మాయిలు త్వరగా ఇళ్లకు వెళ్లేలా ప్రణాళిక చేస్తున్నారు
Download











Click it and Unblock the Notifications