దేశానికి తెలంగాణా ఆహ్వానం.. మంత్రులకు ఆ బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి!

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనులలో దూకుడు పెంచాలని అధికారులను, మంత్రులను ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని పేర్కొన్న ఆయన భారతదేశమంతటా దీనికోసం ఆహ్వానాలను అందించాలని, ఇది రాష్ట్రానికి ఒక మైలురాయిగా ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

వివిధ రాష్ట్రాలకు వెళ్లి గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానాలు
హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8 , 9 తేదీలలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను వ్యక్తిగతంగా వెళ్లి ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మంత్రులను ఆదేశించారు. ప్రతి మంత్రికి నిర్దిష్ట రాష్ట్రాలను కేటాయించి, ఆయా రాష్ట్రాలకు వారు నేరుగా వెళ్లి ఆహ్వాన పత్రికలను అందించి రావాలని సూచించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు అందరూ వచ్చేలా చొరవ చూపాలన్నారు.

Telangana inviting country CM Revanth Reddy has assigned those responsibilities to the ministers

Take a Poll

ఏ ఏ మంత్రులు ఏ ఏ రాష్ట్రాలకు వెళ్లాలో సూచించిన సీఎం రేవంత్ రెడ్డి
ఉత్తమ్ కుమార్ రెడ్డి - జమ్మూ & కాశ్మీర్, గుజరాత్
దామోదర రాజ నరసింహ - పంజాబ్, హర్యానా
దుద్దిళ్ల శ్రీధర్ బాబు - కర్ణాటక, తమిళనాడు
కొండా సురేఖ - ఛత్తీస్‌గఢ్
జూపల్లి కృష్ణారావు - అస్సాం
తుమ్మల నాగేశ్వరరావు - మధ్యప్రదేశ్ వెళ్లి ఆహ్వానాలను ఇవ్వనున్నారు.

ఏపీ, పశ్చిమ బెంగాల్, యూపీ వెళ్ళేది ఈ మంత్రులే
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - ఆంధ్రప్రదేశ్
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి - ఉత్తరప్రదేశ్
రాము అదిరిపోయిందిపొన్నం ప్రభాకర్ - రాజస్థాన్
దనసరి అనసూయ సీతక్క - పశ్చిమ బెంగాల్
వివేక్ వెంకటస్వామి - బీహార్
వాకాటి శ్రీధర్ - ఒడిశా
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ - హిమాచల్ ప్రదేశ్
మహమ్మద్ అజారుద్దీన్ - మహారాష్ట్ర వెళ్లి నేరుగా ఆహ్వాన పత్రికలను అందించి, వారిని ఆహ్వానించనున్నారు.

తెలంగాణ రైజింగ్ 2047 దిశగా
తెలంగాణ ఎంపీలు ఢిల్లీ సీఎం, కేంద్రమంత్రులు, గవర్నర్‌లకు ఆహ్వానాలు అందజేస్తారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం భారత దేశాన్ని ఆహ్వానిస్తుంది అని, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో వృద్ధి పెట్టుబడి మరియు సహకారం యొక్క కొత్త శకం ప్రారంభమవుతుందని, తెలంగాణ రైజింగ్ 2047 దిశగా తెలంగాణ ప్రయాణాన్ని ప్రపంచానికి తెలియజేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+