పైసల్.. పతార ఉంటేనే రేషన్ కార్డులు..?

  • రేషన్ కార్డులకు దళారులు.. కార్డులు ఇప్తిస్తామని వసూళ్లు
  • మీ సేవలో అదనంగా చెల్లింపులు
  • ఎన్నికల కోడ్ ముందే కార్డుల పొందాలని జనాల ప్రయత్నాలు
  • కార్డుల జారీలో జాప్యం.. పతారా ఉంటేనే త్వరగా కార్డులు

హైదరాబాద్: కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. గత 10 ఏళ్లుగా రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే రేషన్ కార్డులకు దళారుల బెడద తప్పడం లేదు. కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు ఎలాగైనా తమకు కార్డు రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత అనేక మార్లు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది. ప్రజా పాలనలో దరఖాస్తులు స్వీకరించి లబ్దిదారుల పేర్లు గ్రామ సభలో ప్రకటించింది. అయితే ఈ జాబితాలో పేర్లు లేని వారి నుంచి నిరసన వ్యక్తం కావడంతో ఈ ప్రక్రియను ఆపేసింది. ఆ తర్వాత మీ సేవల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పెళ్లైన జంటలు పాత రేషన్ కార్డుల్లో పేర్లను తొలగించుకొని మీ సేవల్లో కొత్తగా అప్లే చేసుకోవాలని పేర్కొంది. దాంతో రేషన్‌కార్డు ఆశావహులు గత రెండు నెలలుగా మండలాఫీసులు, మీ సేవలకు పోటెత్తారు.

telangana-is-money-and-influence-the-key-to-getting-a-ration-card

కార్డుల జారీలో జాప్యం..
ఈ ప్రక్రియ ప్రారంభమైన ఆరంభంలో దరఖాస్తు చేసుకున్న వారికి వారం రోజులకే కార్డులు జారీ అయ్యాయి. కానీ ఆ తర్వాత కార్డుల జారీలో జాప్యం చోటు చేసుకుంది. దీన్నే దళారులు క్యాష్ చేసుకుంటున్నారు. కార్డుకు రూ. 2000-5000 వరకు వసూలు చేస్తున్నారు. పాత కార్డుల్లో పేర్ల తొలగింపు నుంచి మీ సేవలో దరఖాస్తు, అధికారుల వెరిఫికేషన్ వరకూ అన్నీ పనులు తామే చేస్తూ కార్డులు అందిస్తున్నారు. మండల కార్యాలం, కలెక్టరేట్‌ల్లోని ఆపరేటర్స్, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్స్‌తో కుమ్మక్కై కార్డులు జారీ చేయిస్తున్నట్లు సమాచారం. మరికొందరు మాత్రం తమ పతారతో పనులు చేయించుకుంటున్నారు.

ఆపరేటర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లతో చనువుగా ఉండే వ్యక్తులతో చెప్పించి కార్డులు జారీ చేయించుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు సైతం తమకు అనుకూలంగా ఉండే వ్యక్తులకు దగ్గరుండి కార్డులు జారీ చేయిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీకి అండగా ఉంటారని, పలుకుబడి కూడా పెరుగుతుందని భావించి మండల కార్యాలయాల చుట్టు తిరుగుతూ కార్డులు వచ్చేలా చేస్తున్నారు. ఈ క్రమంలో కార్డుల జారీలో అధికారులు పర్యవేక్షణ లోపిస్తుంది.

దరఖాస్తులను పరిశీలంచుకుండానే..
నిబంధనల ప్రకారం దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లి వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ రెవెన్యూ అధికారులు భూభారతి దరఖాస్తుల పరిశీలనలో బిజీగా ఉండటంతో కొత్త రేషన్ కార్డుల పరిశీలనలో ఆలస్యవమవుతోంది. అధికారులు అర్హుల గుర్తింపు కోసం '360 డిగ్రీ పోర్టల్' చూస్తూ వారి వివరాలు సేకరిస్తున్నారు. దరఖాస్తుదారుల ఆదాయం, ఆస్తులు, ఆర్థిక స్థితులు, ఉద్యోగ, ఉపాధి వివరాలు ఈ పోర్టల్‌లో తెలిసిపోతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చాలా మంది రేషన్ కార్డులకు అనర్హులుగా తేలుతారు. కానీ ఎలాగైనా కార్డు పొందాలని దళారులను ఆశ్రయిస్తున్నారు.

దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోపు కార్డు జారీ అవుతుందని అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మీ సేవ ప్రతినిధులు చెబుతున్నా.. పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మా వన్ ఇండియా ప్రతినిధి కొంతమంది దరఖాస్తుదారులను సంప్రదించగా.. దరఖాస్తు చేసి 20 రోజులు అవుతున్నా.. కార్డు జారీ అవ్వలేదని చెప్పారు. తమ దరఖాస్తును రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లే ఇంకా పరిశీలించలేదని, వారి నిర్లక్ష్యం కారణంగా అప్లికేషన్ ముందుకు కదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు ఈ విషయంలో జోక్యం చేసుకొని తమకు కార్డులు జారీ అయ్యేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొందరు పతార, డబ్బులతో కార్డులు జారీ చేసుకున్నారని, తమ తర్వాత దరఖాస్తు చేసుకున్నవారికి కూడా కార్డులు వచ్చాయని చెప్పారు. వారి దరఖాస్తులను పరిశీలంచుకుండానే అధికారులు కార్డులను జారీ చేశారని తెలిపారు. ఇక మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు కోసం రూ. 45 తీసుకోవాల్సి ఉండగా.. రూ. వంద వరకు తీసుకుంటున్నారు.

ఎన్నికల కోడ్ భయం..
స్థానిక సంస్థల ఎన్నికలకు కోడ్ వస్తే రేషన్ కార్డుల పంపిణీ ఆగిపోతుందనే భయం దరఖాస్తుదారులకు పట్టుకుంది. దాంతో ముందు జాగ్రత్తగా కార్డులు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే డబ్బులు ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదు. త్వరలో పరిషత్ ఎన్నికలు, పంచాయితీ ఎన్నికలు, మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. దీంతో కార్డుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

సంక్షేమ పథకాలన్నీ రేషన్ కార్డు‌తోనే..
మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాల అమలు కోసం రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవడంతో అందరూ కార్డు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇక రేషన్ కార్డు ఆధారంగానే రుణ మాఫీ జరగడంతో ఒకే కుటుంబంలో ఉన్నవారు సపరేట్ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. సన్న బియ్యం పంపిణీతోనూ రేషన్ కార్డుల కోసం డిమాండ్ పెరిగింది. అంతేకాకుండా ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో చాలా పథకాలు అమలు చేయాల్సి ఉంది. ముఖ్యంగా సౌభాగ్య లక్ష్మీ పథకం కింద ప్రతీ మహిళకు నెలకు రూ.2500 అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ పథకానికి కూడా రేషన్ కార్డ్ ప్రామణికంగా తీసుకోనున్నారు. మరో రెండేళ్లలో ఈ పథకం ప్రారంభమయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆడవాళ్లు రేషన్ కార్డుల కోసం ఇంట్లోవారిపై ఒత్తిడి తెస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+