తెలంగాణ దేశంలోనే టాప్: ఒక్కో కుటుంబంపై అప్పు ఎంతంటే?, ఏపీ పరిస్థితి?

విభజన తర్వాత మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. ఆ తర్వాత కాలంలో అప్పుల్లో కూరుకుపోయింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వాలు భారీ మొత్తంలో అప్పులు చేస్తుండటంతో ఆ రుణాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పౌరుడిపై భారీగా రుణభారం పెరగడం గమనార్హం. తాజాగా వెలువడిన ఓ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే 2021-22 ప్రకారం.. దేశంలోనే అత్యధికంగా అప్పుల్లో ఉన్నది తెలంగాణ వాసులేనని కావడం గమనార్హం. ఒక్కో కుటుంబంలో సగటు సభ్యుల సంఖ్య 3.8 నుంచి 4.1కి చేరినట్లు తెలిపింది. ఇదే సంస్థ 2016-17లో విడుదల చేసిన సర్వేలో ఈ సంఖ్య 3.8 ఉండేది. అయితే, ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3.5 నుంచి 3.7కి చేరింది.

Telangana is top in the country How much is the debt per family

కాగా, జాతీయ సగటు 4.3గా ఉంది. దేశంలో అత్యధికం అయితే, ఉత్తరప్రదేశ్ లో 5, బీహార్‌లో 4.8 వరకు ఒక్కో కుటుంబంలో ఉన్నట్లు ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున రూ. 1,29,599 అప్పు ఉందని తాజా నివేదిక వెల్లడించింది. ఇదే నివేదిక జాతీయ సగటు రూ. 90,372గా పేర్కొంది. కాగా, రాష్ట్రంలో అప్పుల్లో ఉన్న కుటుంబాల సంఖ్య 79 శాతం నుంచి 92 శాతానికి పెరిగింది.

దేశంలోనే అప్పుల్లో ఉన్న కుటుంబాల్లో తెలంగాణ తొలి స్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండటం గమనార్హం. తెలంగాణ 92 శాతం, ఏపీ 86 శాతం కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయి. తెలంగాణలోని ఒక్కో కుటుంబం నెలవారీ సగటు ఆదాయం రూ. 7,811 నుంచి 12,065కి పెరిగింది. ఈ క్రమంలో జాతీయ సగటు రూ. 8,059 నుంచి 12,698కి పెరిగింది.

ఇక, తెలంగాణలో కుటుంబ నెలవారీ సగటు మిగులు ఇది వరకు రూ. 998గా ఉండగా.. ఇప్పుడు రూ. 781కి పడిపోయింది. అయితే, పంజాబ్ లో కుటుంబానికి నెలకు రూ. 5,683 ఆదాయం మిగులుతోంది. బీహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కుటుంబాల వద్ద మిగులు ఆదాయం అతి తక్కువగా ఉండటం గమనార్హం. అయితే, తెలంగాణలో వ్యవసాయ కుటుంబాల నెలవారీ సగటు ఆదాయ మిగులు ఎక్కువగా ఉంది. పంజాబ్ లో రూ. 31,433 ఉండగా.. తెలంగాణలో 13,874గా ఉంది. జాతీయ సగటు రూ. 13,661 ఉంది. అంటే ఈ రెండు రాష్ట్రాలు జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉన్నాయి.

2021-22 వ్యవసాయ సంవత్సరంలో రుణం తీసుకున్న కుటుంబాలు 73 శాతం. జాతీయ సగటు 42 శాతం. ఈ విషయంలో ఏపీ, తెలంగాణ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణలో 54 శాతం కుటుంబాలు ఎంతో కొంత మొత్తాన్ని పొదుపు చేస్తున్నాయి. ఇది జాతీయ సగటు 66 శాతంగా ఉంది. తెలంగాణలో వ్యవసాయ కుటుంబాల సంఖ్య 55 శాతం, వ్యవసాయేతర కుటుంబాల సంఖ్య 45 శాతంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+