జాగృతి ఆధ్వర్యంలో దీక్షా దివస్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద దీక్షా దివస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన దీక్షా దివస్‌ సాయంత్రం వరకు కొనసాగింది. కళాకారులు డప్పు చప్పుళ్లు.. ఆటపాటలతో ఉత్సాహపరిచారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రజాకవి గోరటి వెంకన్న కళాకారులతో కలిసి చిందేసి హుషారెత్తించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌, సినీనటుడు సుమన్‌తో పాటు పలువురు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ సాధనకోసం కేసీఆర్‌ నిరాహారదీక్ష చేపట్టిన రోజుని చాలా పవిత్రమైన రోజుగా నాయిని అభివర్ణించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Jagruthi organises Deeksha Divas at Indira Park
Please Wait while comments are loading...