వచ్చే ఎన్నికల్లో గెలవలేం..తేల్చేసిన సీనియర్ మంత్రి

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పట్టుమని ఏడాది కాకముందే తెలంగాణ రాజకీయాల్లో మంత్రి జూపల్లి కృష్ణా రావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అదిలాబాద్ పర్యటనలో భాగంగా బోథ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందో లేదో తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని స్థానికులు కోరగా, దీనికి స్పందిస్తూ జూపల్లి ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాబోయే ఎన్నికల్లో నేను గెలుస్తానో లేదో తెలియదు. ఒకవేళ నేను గెలిచినా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో అని చెప్పలేను. అందుకే ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. ఒక అధికార పార్టీ మంత్రి తన సొంత ప్రభుత్వ భవిష్యత్తుపైనే సందేహం వ్యక్తం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Telangana Minister Jupally Krishna Rao s Shocking Comments on Congress s Future

మంత్రి వ్యాఖ్యలు విన్న ప్రజలు, అక్కడున్న కార్యకర్తలు షాక్‌కు గురయ్యారు. కొందరు "సార్, అధికార పార్టీలో ఉన్నారనే విషయం మర్చిపోయి మాట్లాడారేమో" అని చెవులు కొరుక్కున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపుతాయో, దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+