ఈటెలతో పాటు మరికొందరు మంత్రులపై వేటు? పార్టీలో అంతర్గత చర్చ, కేసీఆర్ మార్క్ రాజకీయం !!
తెలంగాణ రాష్ట్రంలో ఈటెల రాజేందర్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం, వైద్య ఆరోగ్యశాఖను తన అధీనంలోకి బదిలీ చేసుకుని ఈటెలకు షాక్ ఇవ్వడం, టిఆర్ఎస్ పార్టీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఒక్క ఈటెల రాజేందర్ మాత్రమే కాదు, మరికొంతమంది మంత్రులపై కూడా సీఎం కేసీఆర్ వేటు వేయనున్నారు అన్న చర్చ జోరుగా సాగుతుంది.

జీహెచ్ఎంసీలో ఒకరిద్దరు మంత్రులకు టెన్షన్
ఇప్పటికే పలు సందర్భాలలో అవినీతి ఆరోపణలు, భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు మంత్రులు ఈటెల రాజేందర్ పై తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంలో ఉన్నారు.తాజాగా ఒక్క ఈటెల రాజేందర్ పైనే కాకుండా జీహెచ్ఎంసీ పరిధిలోని ఒకరిద్దరు మంత్రులపైన కూడా సీఎం కేసీఆర్ వేటు వేయడానికి రంగం సిద్ధం చేశారన్న చర్చ టిఆర్ఎస్ పార్టీ వర్గాలలో జోరుగా సాగుతోంది.

జిల్లాలలోని మంత్రులకు తాజా పరిణామాలతో భయం భయం
ఈ మేరకు కీలక శాఖను నిర్వహిస్తున్న మంత్రి ఇప్పటికే ప్రభుత్వ పెద్దలనుండి సంకేతాలు కూడా వెళ్లినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలోని కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా మంత్రులపై కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కరీంనగర్ కు చెందిన మంత్రి గంగుల కమలాకర్, వివాదాస్పద మంత్రి మల్లారెడ్డి, భూ కబ్జా ఆరోపణలు ఉన్న శ్రీనివాస్ గౌడ్ ఇలా చాలా మంది మంత్రులు ఇప్పుడు టెన్షన్ లో ఉన్నారని సమాచారం.

కేసీఆర్ మార్క్ రాజకీయంపై ఆసక్తికరమైన చర్చ
కెసిఆర్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ అంతుచిక్కని,ఎప్పుడు ఎవరిపై విరుచుకుపడతారో తెలుసుకోవడం కష్టమని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అవినీతి ఆరోపణలు ఉన్న మంత్రులు టెన్షన్ లో ఉన్నట్లుగా సమాచారం.అయితే పార్టీ వర్గాలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు ఊహించిన విధంగా కెసిఆర్ నిర్ణయాలు తీసుకోరు అని కూడా చర్చ జరుగుతుంది.
Recommended Video

సీఎం కేసీఆర్ వ్యవహారశైలిపై ఆసక్తికర చర్చ
ఈటెల రాజేందర్ ను టార్గెట్ చేసిన గులాబీ బాస్, ఇదే సమయంలో మరికొందరిని టార్గెట్ చేస్తారా? అంటే అనుమానమే అని సీఎం కేసీఆర్ వ్యవహారశైలిని అంచనా వేసే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా తాజా పరిణామాలతో తెలంగాణ మంత్రులలో వెన్నులో వణుకు పుడుతున్న మాట వాస్తవం. సీఎం కేసీఆర్ హిట్ లిస్ట్ లో చేరితే రాజకీయ భవిష్యత్తు ఉండదనేది పార్టీ నాయకుల అభిప్రాయం.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications